| Daily భారత్
Logo




మరోసారి తెలంగాణకు రానున్న నరేంద్ర మోడీ

News

Posted on 2023-11-09 11:00:01

Share: Share


మరోసారి తెలంగాణకు రానున్న నరేంద్ర మోడీ

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల లో భాగంగా మరోసారి నరేంద్ర మోడీ హైదరాబాదుకు రానున్నారు. ఈనెల 11న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ వేదికగా "మాదిగ విశ్వరూప సభ" నిర్వహణకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. సభకు ప్రధాని మోడీతోపాటు బీజేపీ అగ్ర నాయకులందరూ హాజరయ్యే అవకాశం ఉంది.

ఈ సభలోని ఎస్సీ వర్గీకరణ పై ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నెల 11న సాయంత్రం 4:45 కు ప్రధాని మోడీ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకొనున్నారు. సాయంత్రం పెరేడ్ గ్రౌండ్లో జరిగే మాదిగ విశ్వరూప సభకు మోడీ హాజరవుతారు.

సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో సాయంత్రం 5 గంటల నుండి 5:45 వరకు మాదిగ విశ్వరూప సభ జరగనుంది. దాదాపు 45 నిమిషాల పాటు మోడీ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఉండనున్నారు. సభ ముగిసిన అనంతరం 6 గంటలకు మోడీ తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకే వారంలో రెండుసార్లు ప్రధాని మోడీ హైదరాబాద్‌కి రావడం విశేషం.. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ పై ఈ సభలో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేస్తారని ఉహాగానాలు వినిపిస్తున్నాయి.

దీంతో పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ ఎప్పటినుండో ఆందోళన బాటపడుతున్న ఎస్సీలకు ఈ సభ ద్వారా తమ ఆకాంక్ష నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మోడీ టూర్ కు కొద్దిరోజుల ముందే బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఎస్సీ నాయకులు ముట్టడించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ఎస్సీ వర్గీకరణ పై ప్రకటన చేయాలని నేతలు పట్టుబడుతున్నారు.

దీంతో ఈ నెల 11న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే సభ లో ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణ పై ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూడాలి....

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >