Posted on 2024-09-09 18:08:36
డైలీ భారత్, పాల్వంచ: పాల్వంచ గిరిజన సంక్షేమ భవన్ లో సేవాలాల్ సేన 10 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కీలక నేతలు జెండా ఆవిష్కరణ చేశారు. మొదట మేరమ్మ యాడికి, సేవా లాల్ మహారాజ్ కి పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా యువసేన అధ్యక్షులు భరత నాయక్, పరమేష్ నాయక్ ల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా ఉద్యోగ సంఘ రాష్ట్ర నాయకులు సపావత్ బాలకృష్ణ చౌహాన్ ( టీటీఎఫ్ ), కేటీపీఎస్ గిరిజన ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారి దుర్గా ప్రసాద్ నాయక్, జిల్లా అధ్యక్షులు మాలోతు శివ నాయక్ లు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ... సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ నాయక్ నాయకత్వంలోఅనేక సమస్యలపై పోరాటాలు చేసి, పట్టుదలతో విజయాలను సాధించుకోవడం జరిగిందన్నారు. జాతిని ఏకతాటిపై తెచ్చి, హక్కులు, చట్టాలను కాపాడుతామని శపధం చేశారు. గిరిజన జాతి మహిళలకు రక్షణ కల్పించడంలో తమ సంఘం ప్రధాన భూమిక పోషిస్తుందని తెలిపారు. భూక్య సంజీవ నాయక్ నేతృత్వంలో 2015 లో ఏర్పడ్డ సేవాలాల్ సేన ఈ దశాబ్ద కాలంలో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. నవంబర్ 9 న సింహ గర్జన సభను విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి గూగుల్ చంద్ర నాయక్, రైతు సేన జిల్లా అధ్యక్షుడు పపావత్ రాందాస్ నాయక్, యువసేన జిల్లా అధ్యక్షులు భరత్ నాయక్, మహిళా అధ్యక్షురాలు రుకుమని భాయ్, గంశి బాయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జరుపుల లచ్చు నాయక్, ఉద్యోగ సేన జిల్లా అధ్యక్షుడు ఫుల్ సింగ్ నాయక్, విష్ణు నాయక్, ఉపాధ్యక్షులు బట్టు హుస్సేన్ నాయక్, రాజు నాయక్, విద్యార్థి విభాగ జిల్లా ప్రధాన కార్యదర్శి వంశీ నాయక్, విజయ్ నాయక్, పాల్వంచ మండల అధ్యక్షుడు పరమేష్ నాయక్ లు పాల్గొన్నారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >