| Daily భారత్
Logo




ప్ర‌జా ప‌ద్దుల సంఘం చైర్మ‌న్‌గా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల‌ప‌ల్లి శంక‌ర్

News

Posted on 2024-09-09 19:17:17

Share: Share


ప్ర‌జా ప‌ద్దుల సంఘం చైర్మ‌న్‌గా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల‌ప‌ల్లి శంక‌ర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీ, ఎస్టిమేట్స్ క‌మిటీతో పాటు ప్ర‌జా ప‌ద్దుల సంఘానికి చైర్మ‌న్ల‌ను నియ‌మించింది. ఈ మేర‌కు శాస‌న‌స‌భ కార్య‌ద‌ర్శి వీ న‌ర‌సింహాచార్యులు సోమవారం సాయంత్రం ఉత్త‌ర్వులు జారీ చేశారు. 

ప్ర‌జా ప‌ద్దుల సంఘం చైర్మ‌న్‌గా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం  కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్ల‌ప‌ల్లి శంక‌ర్ ఎంపికయ్యారు.

అదేవిధంగా ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీ చైర్మ‌న్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎస్టిమేట్స్ క‌మిటీ చైర్మ‌న్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్త‌మ్ ప‌ద్మావ‌తి రెడ్డి నియామ‌కం అయ్యారు. ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీలో స‌భ్యులుగా ఎమ్మెల్యేలు ప్ర‌శాంత్ రెడ్డి వేముల‌, గంగుల క‌మ‌లాక‌ర్, రావూరి ప్ర‌కాశ్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ‌, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రామ్ రావు ప‌వార్, అహ్మ‌ద్ బిన్ అబ్దుల్లా బ‌లాల‌, కూనంనేని సాంబ‌శివ‌రావు, ఎమ్మెల్సీలు జీవ‌న్ రెడ్డి, భాను ప్ర‌సాద్ రావు, ఎల్ ర‌మ‌ణ, స‌త్య‌వ‌తి రాథోడ్ నియామ‌కం అయ్యారు. ఎస్టిమేట్స్ క‌మిటీలో స‌భ్యులుగా ఎమ్మెల్యేలు సునీతా ల‌క్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, విజ‌య ర‌మ‌ణారావు, కోరం క‌న‌క‌య్య‌, రామ్‌దాస్ మాలోత్, య‌శ‌స్విని మామిడాల‌, రాకేశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్ర‌భాక‌ర్ రావు, సుంక‌రి రాజు, టీ ర‌వీంద‌ర్ రావు, యాద‌వ రెడ్డి నియామ‌కం అయ్యారు.  

ఎమ్మెల్యే శంకర్ చైర్మన్ గా ఉన్న ప్ర‌జా ప‌ద్దుల క‌మిటీలో స‌భ్యులుగా ఎమ్మెల్యేలు స‌బితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద‌, వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మ‌కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, సంజీవ రెడ్డి, ల‌క్ష్మీ కాంతా రావు, కౌస‌ర్ మోహినోద్దీన్, ఎమ్మెల్సీలు పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, తాతా మ‌ధుసూద‌న్, మీర్జా రియాజుల్ హ‌స‌న్ నియామ‌కం అయ్యారు..

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >