Posted on 2024-09-11 17:56:52
నిమజ్జన కార్యక్రమంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బొబ్బిలి, పెరుమళ్ల చెరువు వద్ద నిమర్జనానికి అన్ని ఏర్పాట్లు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సూచించారు. మున్సిపాలిటీలోని బొబ్బిలి చెరువు వద్ద నిమర్జన ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, కౌన్సిలర్ బచ్చలి నర్సింహా, నాయకులు చెట్ల నర్సింహా, శేఖర్, శ్రీశైలం, రవి, అధికారులతో కలిసి పరిశీలించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బొబ్బిలి, పెరుమళ్ల చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిమర్జనం కోసం క్రేన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, భక్తులు ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెరువుల వద్ద అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని వివరించారు. గణేష్ నిమర్జనం కార్యక్రమంలో తగిన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని, నిమర్జనం కార్యక్రమంలో ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >