| Daily భారత్
Logo




జూదంలో భార్యతో పాటు ముగ్గురు పిల్లల్ని పణంగా పెట్టిన భర్త

News

Posted on 2024-09-12 12:43:12

Share: Share


జూదంలో భార్యతో పాటు ముగ్గురు పిల్లల్ని పణంగా పెట్టిన భర్త

డైలీ భారత్, ఉత్తర ప్రదేశ్: జూదానికి బానిసైన ఓ వ్యక్తి ఏకంగా తన భార్యనే పణంగా పెట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. వ్యక్తి తన స్నేహితులతో జూదం ఆడుతూ భార్యతో పాటు ముగ్గురు చిన్న పిల్లల్ని కూడా పందెంకాశాడు.

ఆమె పట్ల దారుణంగా వ్యవహరించాడు. భార్యపై స్నేహితులు లైంగిక వేధింపులకు అనుమతినిచ్చాడు. ఆమె తన తల్లి ఇంటికి వెళ్లి రావడానికి నిరాకరించడంతో సదరు వ్యక్తి, ఆమెని కొట్టడమే కాకుండా వేలు విరిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

యూపీ రాంపూర్‌లోని షహబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న మహిళకి 2013లో నిందితుడితో వివాహం జరిగింది. ఈ ఘటన తర్వాత బాధిత మహిళ తన వేధింపుల గురించి చెప్పింది. తన అత్త, భర్త కట్నం కోసం వేధించేవారని, భర్త మద్యం, జూదానికి బానిసయ్యాడని సుమారు 7 ఎకరాల భూమిని పోగొట్టుకున్నట్లు చెప్పింది. అతని స్నేహితుల వద్ద తనను కూడా పణంగా పెట్టాడని చెప్పింది. ఈ వేధింపులు భరించలేదక మహిళా హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేశానని, పోలీసులు రావడంతో పారిపోయాడని చెప్పింది. 

తనను లైంగికంగా వేధించడానికి కూడా తన భర్త, అతడి స్నేహితులకు అనుమతినిచ్చాడని చెప్పింది. తనకు నీళ్లు ఇవ్వకుండా, స్నేహితుల ముందే కొట్టినట్లు చెప్పింది. తాను తన తల్లి ఇంటికి వెళ్లి సెప్టెంబర్ 04న వచ్చానని, అతని స్నేహితులు, నావేలు విరిచి తనను ఇంటి నుంచి బటయకు లాగేందుకు యత్నించారని చెప్పింది. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, నా భర్త, అతడి స్నేహితులపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాంపూర్ ఎస్పీ విద్యాసాగర్ మిశ్రా తెలిపారు. బాధిత మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టులో వెల్లడిస్తానని చెప్పింది.

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >