Posted on 2023-11-09 19:20:49
డైలీ భారత్, సిరిసిల్ల : సిరిసిల్ల శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశాడు..అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని మాటలకు మాత్రమే పరిమితమై చేతలకు పరిమితం కాకుండా టిఆర్ఎస్ పనితీరు ఉందని.. ప్రపంచంలోనే గొప్పగా చెప్పుకునే కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కోరుకుపోయి కుప్పకూలిపోతుందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కాటికి పంపుతున్నాడని, బతుకమ్మ చీరల పేరిట సంవత్సరంలో కేవలం మూడు నెలలు మాత్రమే పని కల్పించి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆగం చేస్తున్నాడని, సిరిసిల్లను డల్లాస్,న్యూయార్క్ చేస్తా అని అన్న కేటీఆర్ వర్షాలు పడితే నీళ్లలో ఎందుకు మునుగుతుందని అన్నారు. సిరిసిల్లలో ల్యాండ్ మాఫియా సాండ్ మాఫియా బతుకమ్మ చీరల మాఫియా తో పాటు మాదక దవ్యాల మాఫియాను కేటీఆర్ తీసుకొచ్చాడని, అధికార దుర్వినియోగానికి పాల్పడనని అన్న కేటీఆర్ ప్రజా ఆశీర్వాద సభల పేరిట యువ సమ్మేళనం పేరిట టిఆర్ఎస్ నాయకులు డబ్బులు ఎందుకు పంచుతూ దొరికారని అన్నాడు. సిరిసిల్లలో ఎన్నికల నియామాలని టిఆర్ఎస్ నాయకులు ఉల్లంఘిస్తున్నారని, సిరిసిల్లలో ఉన్న విగ్రహాల సాక్షిగా ప్రమాణం చేసి డబ్బులు మధ్యము పంచకుండా అధికార దుర్వినియోగం చేయకుండా ఎన్నికల్లో పోటీ చేస్తారని కేకే మహేందర్ రెడ్డి అన్నాడు
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >