Posted on 2024-09-13 10:06:28
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో సవాళ్లు, ప్రతిసవాళ్లకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు ఝలక్ ఇచ్చారు. పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అడిషనల్ ఎస్పీ రవి చందన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేవారు. 132, 351 (3) బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు నమోదు చేశారు.
కాగా గత రెండు రోజులుగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య జెండా జగడం జరుగుతోంది. పార్టీ ఫిరాయింపుల అంశంపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గాంధీ ఇంటికెళ్లి బీఆర్‌ఎస్ జెండా ఎగరేస్తానని కౌశిక్ శపథం చేశారు. అయితే ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే అనూహ్య రీతిలో పాడి కౌశిక్ రెడ్డి విల్లాకు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తన అనుచరులను వెంటబెట్టుకొని వెళ్లడం రచ్చకు దారితీసింది. టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. కిటికీలు, కుండీలు ధ్వంసం చేశారు. ప్రతిగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు చెప్పులు విసిరారు. దీంతో గురువారం దాదాపు గంటన్నరపాటు అక్కడి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గాంధీని పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు. ఆ తర్వాత సైబరాబాద్ కమిషనరేట్‌కు హరీశ్, కౌశిక్ తరలించారు.
ఈ పరిణామంపై కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది ప్రభుత్వ దాడి అని అభివర్ణించారు. గాంధీ ఇంటిని శుక్రవారం కచ్చితంగా ముట్టడిస్తానని కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘ఏం జరుగుతుందో మీరే చూస్తారు’’ అని శపథం చేశారు. పోలీసుల వైఫల్యం కారణంగా ఇంత రచ్చ జరిగిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాగా కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే గాంధీ అన్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >