| Daily భారత్
Logo




ప్రేమ జంట ఆత్మహత్య

News

Posted on 2024-09-21 13:56:20

Share: Share


ప్రేమ జంట ఆత్మహత్య

డైలీ భారత్, కామారెడ్డి: టీనేజ్, యంగ్ ఏజ్ లో యువతీ, యువకులు ప్రేమ మైకంలో ఉంటారు. కొందరికి ఆ ప్రేమ జీవితాన్నిస్తే.. మరికొందరిపాలిట శాపంగా మారుతుంది. ప్రేమికుల తల్లిదండ్రుల మధ్య ఇప్పటికీ కూడా కులాలు చిచ్చుపెడుతున్నాయి.

పరాయి కులం, ఇతర మతస్తులను ప్రేమిస్తే ససేమిరా ఒప్పుకోవట్లేదు. తమని కాదని పెళ్లిచేసుకుంటే పరువు హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. కొందరు ప్రేమికులు తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటన వెలుగుచూసింది.

దోమకొండ మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన సాయికుమార్, అంబర్పేటకు చెందిన వీణ  వీరిద్దరూ కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయం ఇంట్లో పెద్దలకు చెప్పి పెళ్లి చేయాలని అడుగగా.. అందుకు వారు ఒప్పుకోలేదు. దాంతో ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేం అనుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సాయికుమార్, వీణ ల ఆత్మహత్యలతో ఇరువురి కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి.. ఇరువురి మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >