| Daily భారత్
Logo




హిందూ దేవాలయాలపై దాడులు చేసే వారిని శిక్షించాలంటూ భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా

News

Posted on 2024-10-19 16:05:03

Share: Share


హిందూ దేవాలయాలపై దాడులు చేసే వారిని శిక్షించాలంటూ భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రం లో హిందూ దేవాలయాలపై ఇటీవలి కాలంలో లో వరుసగా జరుగుతున్న దాడులకు నిరసనగా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని పాల్వంచ లో గల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి ధర్నా నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ముఖ్య అథిదిగా విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర మందిర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ వోరుగంటి సురేష్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మతోన్మాద జీహాదీ ఉగ్రమూకలు గత నెల రోజులు గా అనేక హిందూ దేవాలయాలపై దాడులు చేయడం జరిగిందనీ అయినా ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం ఒక వర్గానికి మద్దతు గా నిలవడమేనని అన్నారు, దేవాలయాలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,

జిల్లా కార్యదర్శి గంగాధరి సిత మాట్లాడుతూ..

కావాలనే విదేశీ తీవ్రవాద శక్తుల ప్రోత్సాహంతో మతోన్మాద శక్తులు హిందూ దేవాలయాలపై దాడులకు తెగబడుతున్నాయనీ, ఇలాంటి రోహిగ్యా, PFI ఉగ్రవాదులను తక్షణమే కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,

ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు చిలుకూరి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు దారా రమేష్, జిల్లా సంఘటన కార్యదర్శి చిట్టెంశెట్టి లక్ష్మయ్య, జిల్లా సహ కార్యదర్శి భూక్యా రమేష్ , జిల్లా బజరంగ్దళ్ సంయోజక్ మెరుగు చింటేశ్వర్ , జిల్లా బజరంగ్దళ్ సాప్తాహిక్ ప్రముఖ్ శ్రీరామోజు మధుసూదన చారీ, జిల్లా ధర్మాచార్య సంపర్క్ ప్రముఖ్ వింజమూరి మురళీకృష్ణ, జిల్లా ధర్మప్రసార్ ప్రముఖ్ రాయల చందర్ రావు, జిల్లా విశేష సంపర్క్ ప్రముఖ్ అజయ్ కుమార్ నాయుడు, జిల్లా సామాజిక సమరసతా ప్రముఖ్ గొడ్ల రాజయ్య, భాజపా జిల్లా అధికార ప్రతినిధి భేమల్ జైన్ కుమార్, పాల్వంచ ప్రఖండ అధ్యక్షులు గుగులోత్ లింబా నాయక్,  బజరంగ్దళ్ పాల్వంచ సంయోజక్ రామగిరి ప్రసాద్, పాల్వంచ ప్రఖండ మాతృశక్తి సంయోజిక మందా వెంకటరమణ, కొత్తగూడెం నగర బజరంగ్దళ్ సంయోజక్ కిరణ్,  కొత్తగూడెం నగర సత్సంగ ప్రముఖ్ అత్తులూరి రాము గారు, చుంచుపల్లి మందిర అర్చక పురోహిత్ ప్రముఖ్ కటకం భాస్కర శర్మ, చుంచుపల్లి బజరంగ్దళ్ సంయోజక్ సిరా మహేష్, చుంచుపల్లి బజరంగ్దళ్ కార్యకర్తలు రెశ్వంత్, రితీష్, భద్రాచలం ప్రఖండ విశేష సంపర్క్ ప్రముఖ్ రాఘవ మరియు కొత్తగూడెం, చుంచుపల్లి, చంద్రుగొండ, ములకలపల్లి, పాల్వంచ, బూర్గంపాడు, భద్రాచలం ప్రఖండల నుండి అనేకమంది విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, మాతృశక్తి కార్యకర్తలు పాల్గొన్నారు.

Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >
Image 1

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం

Posted On 2026-04-11 21:20:31

Readmore >
Image 1

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-11 20:02:47

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:50:42

Readmore >
Image 1

జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:48:36

Readmore >
Image 1

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-11 19:47:25

Readmore >
Image 1

శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం

Posted On 2026-04-11 19:43:57

Readmore >
Image 1

సామాజిక న్యాయం చెప్పటం కాదు - అమలు చేయాలి

Posted On 2026-04-11 17:27:29

Readmore >