| Daily భారత్
Logo




కేటీఆర్ ఇంటి వద్ద ఉద్రిక్తత

News

Posted on 2024-10-27 13:19:37

Share: Share


కేటీఆర్ ఇంటి వద్ద ఉద్రిక్తత

బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు...

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఓరియన్‌ విల్లాస్‌ దగ్గర ఎక్సైజ్‌ పోలీసులు రాజ్‌ పాకాల నివాసంలోకి బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండా లోనికి వెళ్లేందుకు యత్నించడంతో బీఆర్‌ఎస్‌ నేతలు అడ్డగించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు.

హైదరాబాద్‌లోని ఓరియన్‌ విల్లాస్‌ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నివాసం వద్దకు ఆదివారం మధ్యాహ్నం భారీగా చేరుకున్న పోలీసులు బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసనలు తెలిపారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండా లోనికి వెళ్లేందుకు పోలీసులు యత్నించడంతో వారిని అడ్డగించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు.

రాజ్‌ పాకాల నివాసంలోకి వెళ్లకుండా అడ్డుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్‌తో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్న పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారు. ఎమ్మెల్యేలను నెట్టుకుంటూ లోనికి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగారు. దీంతో బీఆర్‌ఎస్‌ నేతలు కేపీ వివేకానంద, బాల్క సుమన్‌, రాజుసాగర్‌, రాకేశ్‌, ఆశిష్‌ యాదవ్‌ సహా 15 మంది అరెస్టు చేశారు.

రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక చివరికి కుటుంబసభ్యులు కలిసి జరుపుకుంటున్న వేడుకను రేవ్‌ పార్టీగా చిత్రీకరించారని కల్వకుంట్ల సంజయ్‌కుమార్‌ మండిపడ్డారు. 

Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >
Image 1

డేటా అవసరం లేని వారి కోసం "స్పెషల్" రీఛార్జ్ ప్లాన్లు!

Posted On 2026-04-08 19:12:36

Readmore >
Image 1

అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!

Posted On 2026-04-08 17:33:40

Readmore >