| Daily భారత్
Logo




బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

News

Posted on 2024-10-28 01:49:45

Share: Share


బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్‌లోని  అబిడ్స్‌లో బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అబిడ్స్ పరిధిలోని బొగ్గులకుంటలో ఉన్న ఓ బాణసంచా దుకాణంలో చెలరేగిన మంటలు.. పక్కనే ఉన్న హోటల్‌లకు వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అగ్ని ప్రమాదానికి సంబంధించిన విషయం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అధికారులు.. సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

దీపావళి పండగ సీజన్.. పైగా ఆదివారం కావడంతో జనం రోడ్లపైకి వచ్చి షాపింగ్‌లు చేస్తున్న వేళ.. ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్నవారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు 5 ఫైరింజన్లను రప్పించారు. మంటల ధాటికి అక్కడే ఉన్న వాహనాలు దగ్ధం అయ్యాయి. స్థానికంగా ఉన్న దేవాదాయశాఖ కార్యాలయానికి సమీపంలోనే ఈ అగ్ని ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో అక్కడే ఉన్న ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఆ దుకాణాంలో బాణాసంచా ఎక్కువగా ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. బాణసంచా దుకాణంలో ఉన్న పటాకులు అంటుకుని పేలడంతో అవి పక్క దుకాణాలకు, అక్కడ పార్క్ చేసిన వాహనాలపై పడటంతో వాటికీ మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ బాణసంచా దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి దృశ్యాలను స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్ అవుతున్నాయి

అయితే దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసే టపాసుల దుకాణాలు అన్ని జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తూ ఏర్పాటు చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులు ఎంత చెప్పినప్పటికీ.. కొంతమంది వ్యాపారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో దీపావళి సీజన్‌లో బాణసంచా విక్రయాల దుకాణాల్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలను గుర్తుచేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్న బాణసంచా దుకాణాలు రూల్స్ పాటించేలా చూడాలని పోలీసులు, ఫైర్ సిబ్బందిని కోరుతున్నారు. అబిడ్స్, కోఠి ప్రాంతాల్లో సాధారణంగానే జనాల రద్దీ ఉంటుండగా.. ఇవాళ ఆదివారం, పైగా దీపావళి సీజన్ కావడంతో పండగల షాపింగ్ కోసం రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ పెరిగిపోయింది.

Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >
Image 1

డేటా అవసరం లేని వారి కోసం "స్పెషల్" రీఛార్జ్ ప్లాన్లు!

Posted On 2026-04-08 19:12:36

Readmore >
Image 1

అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!

Posted On 2026-04-08 17:33:40

Readmore >
Image 1

గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.

Posted On 2026-04-08 17:28:46

Readmore >
Image 1

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 న మెగా రక్తదాన శిబిరం

Posted On 2026-04-08 13:16:01

Readmore >
Image 1

వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం

Posted On 2026-04-08 13:14:54

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-04-08 12:27:46

Readmore >