Posted on 2024-11-02 09:19:44
మూడున్నరేళ్ల చిన్నారిపై సమీప బంధువైన యువకుడి హత్యాచారం!
శవాన్ని పూడ్చేసి ఏమీ తెలియనట్లు!
అభం శుభం తెలియని మూడున్నరేళ్ల చిన్నారిపై దుర్మార్గుడు కర్కశం
పొలంలోకి తీసుకెళ్లి హత్యాచారం
డైలీ భారత్, తిరుపతి: ఈ మధ్యకాలంలో ఆడ పిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఆడవాళ్లు బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ముక్కుపచ్చలారని చిన్నారులను సైతం కామాంధులు వదిలిపెట్టడం లేదు. తాజాగా మూడున్నరేళ్ల చిన్నారిపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడి, అనంతరం హత్య చేసి ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూడ్చేశాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లా వడమాటపేట మండలంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మండలానికి చెందిన ఓ గ్రామంలో ఓ యువకుడు తన సమీప బంధువైన మూడున్నరేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. ఓ దుకాణం వద్ద తినుబండారాలు కొనిచ్చాడు. అక్కడి నుంచి సమీప పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం బాలికను చంపేసి ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని పూడ్చేశాడు. రాత్రి అవుతున్నా పాప ఇంకా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. అయినా సరే ఆచూకీ లభించకపోవడంతో వడమాలపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే బంధువైన యువకుడిపై అనుమానం వచ్చి పోలీసులు విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని అతడు ఇచ్చిన సమాచారం మేరకు చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >