| Daily భారత్
Logo




కుటుంబానికి విషమిచ్చి.. కానిస్టేబుల్ ఆత్మహత్య

News

Posted on 2024-12-29 10:40:24

Share: Share


కుటుంబానికి విషమిచ్చి.. కానిస్టేబుల్ ఆత్మహత్య

డైలీ భారత్, సిద్దిపేట: సిద్దిపేట పట్టణం కలకుంట కాలనీలో విషాదం నెలకొంది. ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పండరి బాలకృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యా పిల్లలకు విషమిచ్చి.. కానిస్టేబుల్ పండరి బాలకృష్ణ ఉరి వేసుకున్నాడు. కానిస్టేబుల్ మృతి చెందగా.. ఆయన భార్యా పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పట్టణం కలకుంట కాలనీ లో దారుణం జరిగింది. ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబం  ఆత్మహత్యకు పాల్పడింది. భార్యా పిల్లలకు విషమిచ్చి.. కానిస్టేబుల్ పండరి బాలకృష్ణ ఉరి వేసుకున్నాడు. కానిస్టేబుల్ మృతి చెందగా.. ఆయన భార్యా పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సిరిసిల్ల 17వ బెటాలియన్‌కు చెందిన పండరి బాలకృష్ణకు భార్య ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. కుటుంబంతో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు తాగి తర్వాత ఉరివేసుకున్న బాలకృష్ణ మృతి చెందాడు. ఇది గమనించిన స్థానికులు స్పృహతప్పిపోయిన కానిస్టేబుల్ భార్యా పిల్లలను హుటాహటిన సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కానిస్టేబుల్ బాలకృష్ణ పిల్లలు యశ్వంత్ (11), ఆశ్రిత్ (9). కాగా భార్యా, పిల్లలు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాలకృష్ణ వృత్తి రీత్యా సిరిసిల్లలో పని చేస్తున్నప్పటికీ, సిద్ధిపేటలో నివాసం ఉంటున్నారు. కానిస్టేబుల్ కుటుంబంతో ఆత్మహత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డారో తెలియరాలేదు. అతని భార్య, పిల్లలు స్పృహలోకి వచ్చి చెబితే వివరాలు తెలిసే అవకాశముంది. ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులే కారణంగా ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >