Posted on 2025-04-19 19:28:50
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి జిల్లాల భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినారు మమత ఆసుపత్రి నందు తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు కలిసి కేక్ కట్ చేసారు. అనంతరం మమత హాస్పటల్ నందు అజయ్ కుమార్ ఇంటివద్ద పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్బంగా కేక్ కట్ చేసి పలువురి శుభాకాంక్షలు అందుకున్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయుటకు అన్ని నియోజకవర్గాల నుండి భారీగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరలివచ్చారు.మాజీ మంత్రి పువ్వాడ మాట్లాడుతూ నేను గత పదిసంవత్సరాలుగా ప్రజల మధ్యలోనే అందర్ని నా కుటుంబ సభ్యులుగా భావిస్తూ ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాను అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు.
నేను నా 59వ పుట్టినరోజు జరుపుకొని 60వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నానని ఇకనుండి నేను ఒక సీనియర్ నాయకుడిగా నా ప్రస్థానం కొనసాగుతుందని అందరు సీనియర్ నాయకులతో కలిసి పని చేస్తానని అన్నారు.ఈ సందర్బంగా నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో గజమాలను క్రేన్ సహాయంతో వేసి ఘనంగా సత్కరించారు.యూత్ నాయకులు మాటేటి కిరణ్,మున్నా,చంటి, ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మరియు వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్,డిసిసిబి మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సీనియర్ నాయకులు SBIT చైర్మన్ RJC కృష్ణ,ప్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ,డిప్యూటీ ప్లోర్ లీడర్ మక్బుల్,మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,మండల అధ్యక్షుడు వీరు నాయక్,మాజీ గ్రంధాలయ చైర్మన్ ఖమర్,CWC చైర్మన్ భారతి రాణి,జిల్లా మైనారిటీ అధ్యక్షుడు తాజుద్దీన్,జేఏసీ బిచ్చాల తిరుమలరావు, ఛాంబర్ ఆప్ కామర్స్ అధ్యక్షులు చిన్ని కృష్ణారావు, కార్యదర్శి మెంతుల శ్రీశైలం,రైస్ మిలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మ రాజేశ్వరరావు,రోటరీ క్లబ్ ఆప్ ఖమ్మం సభ్యులు మల్లాది వాసుదేవరావు, సాంబశివరావు, రామారావు,TNGO నాయకులు అప్జల్ హాసన్,మహిళా నాయకురాలు కొల్లు పద్మ,పల్లా రాజశేఖర్,షకీనా మరియు పలువురు ప్రముఖులు, నాయకులు,కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి
Posted On 2026-06-23 12:14:31
Readmore >
నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం
Posted On 2026-06-23 11:59:52
Readmore >
ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-23 11:09:19
Readmore >
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >