| Daily భారత్
Logo




నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్. జూ.ఎన్టీఆర్ మామకు షాక్

News

Posted on 2025-04-19 22:30:32

Share: Share


నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్. జూ.ఎన్టీఆర్ మామకు షాక్

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ లో HYDRAA నిర్వహించిన ఆపరేషన్లో లాంగర్ హౌజ్కు చెందిన ఒక బాలుడు విజిల్బ్లోయర్గా మారాడు. ఆ బాలుడు రాసిన లేఖ వల్ల జూబ్లీహిల్స్లోని 39 ఎకరాల ప్రధాన ప్రభుత్వ భూమిని తిరిగి పొందేందుకు కారణం అయింది. దీని విలువ రూ.3,900 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

రోజూ క్రికెట్ ఆడుకున్న గ్రౌండ్ లో కంచె

హైడ్రాకు లేఖ రాసిన బాలుడు JRC కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని బహిరంగ స్థలంలో క్రికెట్ ఆడుతూ ఉంటాడు. అయితే అకస్మాత్తుగా అక్కడ కంచెలు వేసేశారు. నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆ బాలుడు హైడ్రాకు లేఖ రాశాడు. హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ ఆ భూమి రికార్డులను పరిశీలించారు. 

ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదని, ప్రస్తుతం చట్టపరమైన వివాదంలో ఉందని గుర్తించారు. HYDRAA ఆ స్థలాన్ని పరిశీలించి, భూమిని విక్రయించడానికి, అభివృద్ధి చేయడానికి జరిగిన ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకుని కూల్చివేసింది.

పిల్లవాడి లేఖతో కదిలిన హైడ్రా

నిషేధ జాబితాలో ఉన్న భూమిని నార్నే ఎస్టేట్స్ నిశ్శబ్దంగా అమ్మేస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. చట్టపరమైన వివాదం సమయంలో ఏదైనా అభివృద్ధి లేదా అమ్మకం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన జోన్లలో ఒకటైన 39 ఎకరాల విస్తీర్ణంలో, ఎకరానికి రూ. 100 కోట్లకు పైగా మార్కెట్ రేటును ఉంటుంది. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించి వివిధ కోర్టులలో కేసులున్నప్పటికీ చుట్టూ ప్రహరీ నిర్మించి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆక్రమణలకు పాల్పడుతున్నారు.

అక్కడ బోర్డులు ఉన్నా సరే అమ్మేస్తున్న నార్నే గ్రూపు

ల్యాండ్ గ్రాబింగ్ కేసున్నట్టు అక్కడ బోర్డులుంటుండగానే.. మరోవైపు అక్కడ ప్లాట్ల కొనుగోలుకు సంప్రదించాల్సిన ఫోను నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేసింది నార్నే ఎస్టేట్స్ సంస్థ. అనుమతిలేని లే ఔట్తో రహదారులు నిర్మిస్తూ.. ప్లాట్లు అమ్మకాలు చేపట్టిన ఆక్రమణదారులు రెచ్చిపోయారు. హాఫీజ్పేట్, రాయదుర్గం ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ బోర్డు లు పెట్టారు హైడ్రా అధికారులు. ఆక్రమించుకున్న వారిపై కేసులు పెట్టారు.

కబ్జా దారులపైకేసులు పెట్టిన హైడ్రా

నార్నె ఎస్టేట్స్ కు యజమాని నార్నే శ్రీనివాసరావు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతీ తండ్రి. ఆయనకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థనే భూముల్ని కబ్జా చేసినట్లుగా హైడ్రా చెబుతోంది. రాయదుర్గం ఎరియాలో నార్నే పేరుతో ఓ రోడ్ ఉంటుంది. ఆ ఏరియాలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేసారు. అయితే ఇప్పుడు ఆ భూములు కబ్జాలని హైడ్రా చెబుతోంది. ఈ కూల్చివేతలపై నార్నే గ్రూపు నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.

Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >