| Daily భారత్
Logo




బొట్టు ఉందని చంపేశారు.. అరణ్య రోదన..

News

Posted on 2025-04-23 09:32:10

Share: Share


బొట్టు ఉందని చంపేశారు.. అరణ్య రోదన..

Pahalgam Attacks Video: బొట్టు ఉందని చంపేశారు.. భర్తతో హనీమూన్‌కు వచ్చిన భార్య అరణ్య రోదన..

డైలీ భారత్, జమ్మూ కాశ్మీర్: జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ముఖ్యంగా అనంత్ నాగ్ జిల్లా పహాల్గంలో హిందు టూరిస్టులే టార్గెట్ గా కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో.. దాదాపు.. 27 మంది టూరిస్టులు ఘటన స్థలంలోనే విగత జీవులుగా మారిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి సీరియస్ గా ఉంది.

ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో.. బైసరన్ ప్రాంతంలో విహరించేందుకు వచ్చిన హిందుటూరిస్టులు టార్గెట్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో ఇటీవల పెళ్లి అయి.. హనీమూన్ కు వచ్చిన జంట ఘటన పెను విషాదంగా మారింది. భార్య కళ్ల ముందే భర్తను పాయింట్ బ్లాంక్ లో కాల్చిచంపారని...మహిళ వాపోయింది. తన మతం అడిగి మరీ ఈ దాడులకు పాల్పడినట్లుకూడా ఆమె చెప్పింది. 

హిందువులు, బొట్టు ఉన్నవాళ్లను టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారని పహాల్గంలోని బాధితులు బలగాలకు వెల్లడించాయి. అడవి ప్రాంతం నుంచి ఒక్కసారిగా ఉగ్రవాదులు బైసరన్ ప్రాంతానికి వచ్చి ఇష్టమున్నట్లు కాల్పులకు తెగబడ్డారు. అప్పటి వరకు ఆనందంగా..కేరింతలతో ఉన్న ప్రదేశమంతా రక్తపాతంతో, శవాల దిబ్బగా మారింది .

ఈ ఘటనను జమ్ము సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. అదే విధంగా ప్రధాని మోదీ ఘటనపై ఆరాతీశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హుటా హుటీన శ్రీనగర్ కు బయలుదేరారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. ఈ ఘటన మరోసారి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈఘటనకు చెందిన వీడియోలు వైరల్గా మారాయి.


#Pahalgam Terrorist Attack

Image 1

నకిలీ బంగారం చూపి దోపిడీ.. ఏడుగురు ముఠా సభ్యుల అరెస్ట్

Posted On 2026-06-20 07:55:27

Readmore >
Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >