| Daily భారత్
Logo




భూ భారతి చట్టం అవగాహన సదస్సులో పాల్గొన్న రైతులు లకు కలెక్టర్ సూచనలు

News

Posted on 2025-04-23 22:42:34

Share: Share


భూ భారతి చట్టం  అవగాహన సదస్సులో పాల్గొన్న రైతులు లకు కలెక్టర్ సూచనలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం భూ సమస్యల పరిష్కారానికి కీలకమైందని, 

రైతులు దీనిపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్  తెలిపారు

డైలీ భారత్,  మాసాయిపేట:బుధవారం  మాసాయిపేట మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సులో ఆర్డిఓ జై చంద్రారెడ్డి, తాసిల్దార్ జ్ఞాన జ్యోతి, ఏడిఏ రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొని,చట్టం మరియు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.

ముందుగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు భారతి చట్టంపై ఆటపాటలతో అవగాహన కల్పించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు భూభారతి చట్టంపై సందేశం, రైతులకు వినిపించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూ భారతి చట్టం రూపొందిం చిందన్నారు. ఎంతో మంది మేధావులు, అధికారులు భూభారతి చట్టానికి రూపకల్పన చేశారని వివరించారు. భూ పరిపాలన వ్యవస్థ అనేక దశల్లో అభివృద్ధి చెందిందని,గతంలో జరిగిన కొన్ని చట్టాలు, సర్వేలు, పాస్‌బుక్‌లు, ఆర్.ఓ.ఆర్ చట్టం వంటి చర్యలను గుర్తుచేశారు.ధరణి పోర్టల్‌లో లేని అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభించనున్నదని తెలిపారు.ఈ చట్టాన్ని  డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు.చట్టం రూపొందించే సమయంలో రైతుల సంక్షేమం కోసం వారి సమస్యలను ప్రస్తావించి, అభిప్రాయాలను చట్టంలో ప్రతిబింబించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. గతంలో ధరణి ద్వారా మన జిల్లా టాప్ 5లో ఉండగా,భూ భారతి చట్టంతో ప్రక్రియలు త్వరగా పూర్తి అవుతాయని తెలిపారు.ధరణిలో భూ సమస్యలపై దరఖాస్తు చేసుకునేందుకు 33 మాడ్యూల్స్ పొందుపరచారని, దీనివల్ల ఏ సమస్యకు ఏ మాడ్యూల్‌లో దరఖాస్తు చేయాలో రైతులకు అర్థమయ్యేది కాదని అన్నారు. భూభారతిలో 6 మాడ్యూల్స్ మాత్రమే ఉండి సులభమైన దరఖాస్తు ప్రక్రియ ఉంటుందని వివరించారు.భూ భారతి చట్టంలో తహసిల్దార్ స్థాయి నుండి సీసీఎల్ఏ స్థాయి వరకు సమస్యలను పరిష్కరించే  అప్పీల్ వ్యవస్థను వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.ఈ చట్టం ద్వారా భూముల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించబడిందని,భూమి రిజిస్ట్రేషన్,మ్యూటేషన్ ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందన్నారు. భూముల విస్తీర్ణం, మార్పులు, చేర్పులకు అవకాశం ఉందని తెలిపారు.వార సత్వంగా వస్తున్న యజమానులకు పేరు మార్పులు చేయవచ్చని తెలిపారు.పెండింగ్ లో ఉన్న సాధా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు.ఈ దరఖాస్తుల పై తహసిల్దార్ 30 రోజుల్లోగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటారని అన్నారు.గడువు తర్వాత ఆటోమేటిక్ గా మూటేషన్ జరుగుతుందని అన్నారు.మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు చేస్తారని,దీని ద్వారా భూ ఆక్రమణలకు అవకాశం ఉండదని అన్నారు.గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహించి భూ సమస్యలు త్వరగా పరిష్కరించడానికి అవకాశం కల్పిస్తామన్నారు.భూ భారతి చట్టం మొదట రాష్ట్రవ్యాప్తంగా నాలుగు మండలాల్లో పైలెట్‌గా అమలవుతుందని,తరువాత ప్రతి జిల్లాలో ఒక్క మండలంలో నిర్వహించి,అవసరమైతే మార్పులు చేసి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారని తెలిపారు.రాబోయే రోజులలో భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేస్తారని తెలిపారు.భూమి హక్కుల రక్షణకు భూ భారతి చట్టం ఉపయోగకరమైందని, రైతులు  దీన్ని అర్థం చేసుకుని ఉపయోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ,రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >