Posted on 2025-04-27 19:01:27
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్య దర్శిగా కె.రామకృష్ణారావు ను నియమించింది ప్రభుత్వం. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్ కు చెందిన ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి.. 2021 జనవరి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తు న్నారు.
శాంతి కుమారి పదవి కాలం ఈనెల 30న ముగియ నుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీఎస్ గా రామకృష్ణారావు పేరును ఖరారు చేశారు.
1990 బ్యాచ్ కు చెందిన రామకృష్ణారావు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా రు. వచ్చే ఆగస్టులో ఆయన రిటైర్ కానున్నారు. ప్రస్తుతమున్న ఐఏఎస్‌ల్లో శశాంక్ గోయల్ తరువాత రామకృష్ణారావు సీనియర్ గా ఉన్నారు.
ఆర్థిక శాఖలో ఆయన చేసిన సేవలు, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో తనకున్న అనుభవం తోడ్పడుతుం దన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయనను నియమించారు.
రామకృష్ణారావు గతంలో నల్గొండ జాయింట్ కలెక్టర్, గుంటూరు కలెక్టర్ గా కూడా విధులు నిర్వహిం చారు. రామకృష్ణారావు మే 1 నుండి తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించనున్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >