Posted on 2025-05-04 20:06:31
డైలీ భారత్, ఖమ్మం న్యూస్: ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండల అధ్యక్షునిగా ఎస్టీ సమాజ వర్గానికి చెందిన భూక్య రమేష్ ను నియమిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు తెలియచేశారు.
సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఎప్పుడూ ముందుంటారని, భూక్య రమేష్ ను భారతీయ జనతా పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షులుగా నియమించి సంచలనానికి తెర తీశారని, ఒక గిరిజనుడికి మండలాధ్యక్షుడుగా బాధ్యతలు అప్పగించి తనను తాను నిరూపించుకునే అవకాశం భూక్య రమేష్ కి కల్పించారని, జిల్లా అధ్యక్షులు నిర్ణయాన్ని మండలంలోని కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారని ఈ సందర్భంగా పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు.
కష్టపడి పనిచేసే వారిని గుర్తించడంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ముందే ఉంటుందని,దానికి తగ్గట్లే ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు నిర్ణయాలు ఉంటాయని, భూక్యా రమేష్ నియామకమే ఇందుకు నిదర్శనమని తెలంగాణా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ కొనియాడారు. ఈ సందర్భంగా అన్నవరపు సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు కి ధన్యవాదాలు తెలియజేశారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >