| Daily భారత్
Logo




మే 20 న దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి

News

Posted on 2025-05-15 14:54:45

Share: Share


మే 20 న దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: 2025 మే 20న దేశ వ్యాపితంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జరుగుతున్న సార్వత్రిక సమ్మె లో కార్మికులు అదిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని  ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు పిలుపునిచ్చారు. 

గురువారం జూలూరుపాడు లో కార్మికుల తో కలిసి సమ్మె గోడ పత్రికల ను ఆవిష్కరించారు.అనంతరం గోపాలరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ఏధేచ్చగా అమలుకు పూనుకున్నదని ఆరోపించారు. 29 కార్మిక చట్టాలను నవీకరిస్తున్నామనే పేరుతో, గతంలో పోరాడి సాధించిన హక్కులను హరిస్తూ, “4 లేబర్ కోడ్స్” తీసుకురావడం జరిగిందని,వీటి అమలును నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేసారు. కనీస వేతనాలు 26 వేలు ఇవ్వాలని, కనీస ఈపీఎఫ్ పెన్షన్ 9 వేలు ఇవ్వాలని, స్కీం వర్కరన్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ని రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే సుప్రీం కోర్టు తీర్పు అమలు చేయాలని,ఆటో  మోటార్, హమాలీ వర్కర్స్ కి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, రైతాంగానికి కనీస మద్దతు ధరను ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించరాదనే డిమాండ్లతో కార్మిక వర్గం ఒక రోజు సమ్మె చేసి, నిరసన తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. 

ఈ కార్యక్రమంలో గంధం చంటి, నిమ్మటూరి గోపాలరావు, శ్రీను,నరేష్, ఇరు, రవి, తదితరులు పాల్గొన్నారు.

.

Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >