Posted on 2025-05-15 14:57:02
కృషి ఎప్పుడు వృధా కాదు.... కరస్పాండెంట్ జి భాస్కరరావు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ స్థానిక మార్కెట్ ఏరియాలో గల స్టార్ చిల్డ్రన్ హైస్కూల్ విద్యార్థులు షేక్ నుస్రత్ జి. నవ్య స్నేహిత ఇ. కార్తీక్ కుమార్ ఈ సంవత్సరం ప్రకటించిన ఎస్ ఎస్ సి ఫలితాలలో అద్భుత ప్రతిభను కనబరిచారు. సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఈ విద్యార్థుల అద్భుత ప్రతిభకు స్పందించి దేశంలో ఫ్యాషన్ బ్రాండ్ రంగంలో అగ్రగామిగా నిలిచిన రిలయన్స్ ట్రెండ్స్ సంస్థ, స్థానిక శాఖ మేనేజర్ రవి రాజ్ స్టోర్ మేనేజర్ జి రవీంద్రబాబు బుధవారం సాయంత్రం వీరిని బహుమతులు, ప్రత్యేక మెడల్స్ తో ఘనంగా సత్కరించి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జి భాస్కరరావు మాట్లాడుతూ సామాన్య కుటుంబీకులైన ఈ విద్యార్థులు చదువు ఎడల కనబరిచిన నిరంతర కృషి అంకిత భావం పట్టుదలను గుర్తించి స్పందించిన సంస్థ యాజమాన్యమునకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినారు. కృషి ఎప్పుడూ వృధా కాదు అనే నానుడికి ప్రతిభావంతులైన తమ విద్యార్థులకు దక్కిన ఈ గౌరవం నిదర్శనమని ఇది వారు మరెన్నో విజయాలు సాధించుటకు తోడ్పడుతుందని, ఇలాంటి ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని కొనియాడారు. అనంతరం శాఖ సిబ్బంది కరస్పాండెంట్ ను ఘనంగా సన్మానించి విద్యా సేవారంగంలో తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు మహేశ్వరి, ప్రశాంతి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >