| Daily భారత్
Logo




18న ఇస్రో 101వ రాకెట్‌ ప్రయోగం

News

Posted on 2025-05-16 08:39:05

Share: Share


18న ఇస్రో 101వ రాకెట్‌ ప్రయోగం

డైలీ భారత్, శ్రీహరికోట: ఈ ఏడాది జనవరిలో 100 రాకెట్‌ ప్రయోగాల మైలురాయిని అందుకున్న ఇస్రో తర్వాతి రాకెట్‌ లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఈ నెల 18 (ఆదివారం)న శ్రీహరికోటలోని షార్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి61ను ప్రయోగించనుండగా ఇది ఇస్రోకు 101వ రాకెట్‌ ప్రయోగం కానుంది. దీని ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం (ఈఓఎస్‌) రిశాట్‌-18ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. శనివారం ఉదయం 7.59 గంటలకు ఈ మిషన్‌ కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. నిరంతరాయంగా 22 గంటలపాటు కొనసాగిన తర్వాత ఆదివారం ఉదయం 5:59 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఇస్రో అధిపతి నారాయణన్‌ గురువారం షార్‌కు చేరుకున్నారు. అంతకుముందు ఆయన చెన్నైలో మాట్లాడుతూ.. దేశ భద్రత, ప్రజల అవసరాలే ప్రధాన లక్ష్యంగా ఇస్రో ప్రయోగాలు చేపడుతుందని, ఇతర దేశాలతో పోటీ పడదని పేర్కొన్నారు.

Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >