| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కేటీఆర్‌ క్యాంప్‌ ఆఫీస్ వద్ద హైటెన్షన్

News

Posted on 2025-05-26 10:45:13

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కేటీఆర్‌ క్యాంప్‌ ఆఫీస్ వద్ద హైటెన్షన్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలోని కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది

జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి  ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే వారిని బీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అయితే సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు నినాదాలు చేయగా.. మరోవైపు కేటీఆర్‌ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది

ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ ఫోటో పెట్టడం లేదని పలు సందర్భాల్లో బీఆర్‌ఎస్ నేతలు ప్రోటోకాల్ విషయంలో ఆందోళనకు దిగారు. తాజాగా కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను కేటీఆర్‌ క్యాంప్ కార్యాలయంలో ఎందుకు పెట్టకూడదంటూ ప్రశ్నిస్తూ.. సీఎం ఫోటోతో కేటీఆర్‌ క్యాంపు కార్యాలయంలో దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో గేటు వద్దే బీఆర్‌ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది.

తోపులాట చోటు చేసుకోగా...

ముగ్గురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. దాదాపు 15 నిమిషాల పాటు రెండు పార్టీల నేతలు ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. వెంటనే కాంగ్రెస్‌ శ్రేణులను అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే కేటీఆర్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో సిరిసిల్లలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కేటీఆర్ క్యాంపు ఆఫీసు వద్ద మరల ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా చేరుకుంటున్నారు.

Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >
Image 1

"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"

Posted On 2026-08-10 03:31:22

Readmore >
Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >