Posted on 2025-05-26 11:12:13
డైలీ భారత్, భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఆధ్యాత్మికత తో శోభిల్లిన సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నా నాల కోసం వేలాదిమంది భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు.
భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి నదిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలువురు దంపతులు కలిసి త్రిగుణాత్మక నదుల సాన్నిధ్యంలో స్నానం చేసి పుణ్యఫలాన్ని అందుకుం టున్నారు. తీరం వెంట సైకత లింగాలను ఏర్పాటు చేసి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలాగే, పితృదేవతలకు శ్రాద్ధకర్మలతో తీరాన్ని పరిపూర్ణంగా మార్చారు.
ఈ సాయంత్రం 7 గంటలకు త్రివేణి సంగమంలో సప్తహా రతులు జరగనున్నాయి. అలాగే పుష్కరాల ముగిం పు సందర్భంగా పూజారు లు చండీ హోమాన్ని నిర్వహించనున్నారు. చివరి రోజు కావడంతో అధికారు లు భారీగా భక్తుల రాకను ఊహించి ట్రాఫిక్ ఇబ్బందు లు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సాయంత్రం పుష్కర స్నానానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రానున్నారు. అనంతరం ముగింపు వేడుకల్లో పాల్గొని నవరత్నామాల హారతిని దర్శించనున్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, నాగఫణి శర్మలు పాల్గొంటారు.
పుణ్యస్నానం అనంతరం భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతూ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. సరస్వతీ మాత, శుభానం దదేవి అమ్మవారుల దర్శనార్థం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఒకవైపు భక్తి భావన, మరో వైపు భక్తుల ఉత్సాహంతో కాళేశ్వరం పుష్కర క్షేత్రంగా ప్రకాశించింది.
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >