| Daily భారత్
Logo




గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం

News

Posted on 2023-12-11 09:50:48

Share: Share


గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం

రిజర్వేషన్లు మారుతాయా...?

పాత రిజర్వేషన్లు కొనసాగేనా...?

డైలీ భారత్,  తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలకు 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న పాలకవర్గం పదవీకాలం 2024 జనవరి 31న వస్తుంది. 2024 ఫిబ్రవరి నుండి నూతన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నిక కావలసి ఉంటుంది. 2018 లో పాలకవర్గం రిజర్వేషన్ 5 సంవత్సరాలకు ఒక కాలపరిమితి, మరొక 5 సంవత్సరాలకు 2  పర్యాయములు సర్పంచులు, వార్డు సభ్యులు 10 సంవత్సరాల కాలానికి ఓకే రిజర్వేషన్ కొనసాగుతుందని చట్టం చేయడం జరిగింది. ఈ విధానం రూపొందించిన బి.ఆర్.ఎస్ ప్రభుత్వం మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతున్న ప్రభుత్వం గత ప్రభుత్వం రూపొందించిన10 సంవత్సరాల కాలపరిమితి మరియు రెండు పర్యాయాల రిజర్వేషన్ మారుస్తుందా...? లేదా అనేది రాజకీయ నాయకుల సమాలోచన గ్రామపంచాయతీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న ఆశావాహులు ఆశతో రిజర్వేషన్ మారుతుందా...? లేదా అని రాజకీయ నాయకులు సందిద్దo లో ఉన్నారు. ఎస్సీ ,ఎస్టీ, బీసీ, జనరల్, మహిళా రిజర్వేషన్ ఆశావాహులు అవకాశం కోసం వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ వద్ద 224 నూతన గ్రామపంచాయతీల ఏర్పాటు గురించి గవర్నర్ సంతకం కోసం ఫైల్ పెండింగ్లో ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ సమయం వరకు నూతన 224 గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించిన పెండింగ్ ఫైల్ పై సంతకం పెడితే మొత్తం 12,769 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ గవర్నర్ సంతకం కానీ 224 నూతన గ్రామపంచాయతీలో ఏర్పాటు గురించిన అంశం పెండింగ్లో ఉంటే పాత గ్రామపంచాయతీలు అయిన 12,769 గ్రామపంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. 2024వ సంవత్సరం ఎన్నికల సంవత్సరం గా మారుతుంది. ఎందుకనగా 2024 గ్రామపంచాయతీ ఎన్నికలు, మండల పరిషత్తు ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఖాళీ అయినా శాసనమండలి సభ్యుల ఎన్నిక పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి.

Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >