Posted on 2025-05-29 15:44:41
డైలీ భారత్, సూర్యాపేట: ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు ఈరోజు ఉపాధ్యాయుల వేసవి శిక్షణ తరగతుల్లో షీ టీమ్స్, పోలీస్ కళాబృందం వారు డ్రగ్స్ నిర్మూల, సైబర్ మోసాల పట్ల జాగ్రత్తలు, వీటి నివారణలో ఉపాధ్యాయుల పాత్ర అనే అంశాలపై సూర్యాపేట పట్టణ పరిధిలోని హనుమాన్ నగర్ లో ఉన్నటువంటి నెంబర్ వన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయలకు కెపాసిటి బిల్డింగ్ ప్రోగ్రాం నందు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన, పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.
ప్రతి స్కూల్, కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా, ATM కార్డ్ వివరాలు, OTP వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు. విద్యాలయాల్లో విద్యార్థుల నదవడికపై దృష్టి పెట్టిన చెడు అలవాటుకు గురైతే సన్మార్గంలో నడపాలి అన్నారు. షీ టీం ఫోన్ నెంబర్ 8712686056 కి సమాచారం ఇవ్వండి మీయొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు.
అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యతిపతి రావు, జిల్లా రిసోర్స్ పర్సన్స్ వేల్పుల వెంకటేశ్వర్లు, అంకతి వెంకన్న, మధుసూదన్ రెడ్డి, ఖాదర్ పాషా, దండాల మధు, షీ టీం మహిళా కానిస్టేబుల్ ఉమా, కళాబృందం ఇంచార్జి యల్లయ్య, సభ్యులు గోపయ్య, చారి, నాగార్జున , గురులింగం,మరియు టీచర్స్ పాల్గొన్నారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >