| Daily భారత్
Logo




వివాహిత మహిళపై అత్యాచార ప్రయత్నం

News

Posted on 2025-05-29 19:39:43

Share: Share


వివాహిత మహిళపై అత్యాచార ప్రయత్నం

డైలీ భారత్, నంగునూరు: నంగునూరు మండల పరిధిలోని ఒక గ్రామంలో తల్లిగారింటి ఇంటి వద్ద ఉన్న వివాహిత మహిళపై అత్యాచార ప్రయత్నం చేసిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన స్నేహితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు రాజగోపాలపేట ఎస్సై ఆసిఫ్, ప్రొబేషనరీ ఎస్సై సౌజన్య తెలిపారు. పాలమాకుల గ్రామానికి చెందిన రేషన్ డీలర్ సంపంగి మహేష్ అనే వ్యక్తి మండల పరిధిలోని ఒక గ్రామంలో తనకు పరిచయం ఉన్న మహిళపై బుధవారం రాత్రి అత్యాచార ప్రయత్నం చేశాడు. ఇందుకోసం పాలమాకుల గ్రామానికి చెందిన తన స్నేహితుడు పల్లెపు సంపత్ తో ద్విచక్ర వాహనంపై మహిళ తల్లిగారి ఊరికి వెళ్లారు. సంతోష్ ను బయట కాపలా ఉంచి సంపంగి మహేష్ మహిళ ఉన్న ఇంట్లోకి రాత్రి చొరబడి మహిళపై అత్యాచారం చేయబోయాడు. మహిళ అరవడంతో ఆమె తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు నిద్ర లేచారు. దీంతో మహేశ్, సంపత్ లు ద్విచక్రవాహనం మీద పారిపోయారు. గురువారం పాలమాకుల బస్ స్టాండ్ వద్ద టీఎస్ 36 ఏ 0206 నెంబరు గల ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు వివరించారు.

Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >
Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >