Posted on 2025-05-30 08:42:04
మొదటి విడతలో 2047 మంది లబ్ధిదారులకు ఇళ్ళ మంజూరు
నియోజకవర్గం వ్యాప్తంగా3500 ఇండ్లు మంజూరు
పటాన్చెరు: డైలీ భారత్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
పటాన్చెరు మండలం చిన్న కంజర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుడి గృహ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు సొంత స్థలం ఉంటే ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ సొంతింటిని నిర్మించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గం వ్యాప్తంగా 3500 ఇల్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. పూర్తి పారదర్శకతతో రాజకీయాలకు అతీతంగా అర్హులకే వీటిని కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు.
ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని దుర్వినియోగం చేయకుండా ఇళ్లను నిర్మించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్ల కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కోరారు. మొదటి విడతలో 2047 మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇళ్ల నిర్మాణ దశకు అనుగుణంగా నిధులు విడుదల అవుతాయని తెలిపారు. చిన్న కంజర్ల గ్రామంలో 65 మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరయ్యాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ రంగారావు, ఎంపీడీవో యాదగిరి, గృహ నిర్మాణ శాఖ డిఈ రవీందర్, గ్రామీణ నీటిపారుల శాఖ డిఈ శ్రీనివాస్, గ్రామ మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >