| Daily భారత్
Logo




కార్తీక మాసం చివరి సోమవారం రోజున బస్సులలో రద్దీ

News

Posted on 2023-12-11 10:06:26

Share: Share


కార్తీక మాసం చివరి సోమవారం రోజున బస్సులలో రద్దీ

కార్తీక మాసం చివరి సోమవారం రోజున బస్సులలో "మహాలక్ష్మి" ల రద్దీ

డైలీ భారత్, పెద్దపల్లి : మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో మహిళలు, బాలికలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు.

ఈనెల 9 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. దీంతో చాలా మంది మహిళలలు బస్సుల్లో ప్రయాణిం చేందుకు ఆసక్తి చూపు తున్నారు. తద్వారా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. గత ఆదివారం డిసెంబర్ 3తో పోలిస్తే ఈ ఆదివారం డిసెంబర్ 10 దాదాపు 15 శాతం పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

బస్సు ప్రయాణికుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని తెలిపారు. టిమ్స్‌లో "జీరో టికెట్‌" సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి వచ్చాక వాస్తవ సంఖ్యపై స్పష్టత వస్తుందని అన్నారు.

మిగతా రోజులతో పోలిస్తే సాధారణంగా సోమవారం ప్రయాణికుల రద్దీ ఎక్కు వగా ఉంటుంది. అందు లోనూ ఇవాళ కార్తికమా సంలో ఆఖరి సోమవారం కావడంతో మహిళా ప్రయాణికుల రద్దీ భారీగా ఉండవచ్చని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్లకు సెలవులను రద్దు చేశారు. సిబ్బందికి సెలవులు లేవని..విధులకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇక వేములవాడ, కాళేశ్వరం, కీసరగుట్ట, రామప్ప వంటి పుణ్యక్షేత్రాలకు పెద్ద  సంఖ్యలో బస్సులు నడిపించాలని ఆర్టీసీ నిర్ణయించింది

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >