Posted on 2025-06-01 09:43:51
డైలీ భారత్, హైదరాబాద్:హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీల్లో మిస్ థాయిలాండ్ ఒపల్ సుచత చువంగ్ ప్రపంచ సుందరి టైటిల్ ను కైవసం చేసుకుంది! మొత్తం 110 దేశాలకు చెందిన భామలు పోటీలో పాల్గొన్నారు. అందులో ఫైనల్స్ కు 40 మంది చేరుకున్నారు. శనివారం హైటెక్స్ లో అత్యంత వైభవోపేతంగా జరిగిన తుది పోటీల్లో 72వ మిస్ వరల్డ్ టైటిల్ ను మిస్ థాయిలాండ్ సొంతం చేసుకుంది. పెద్ద పెద్ద దేశాలు తోక ముడిచాయి! చిన్న దేశాలు ఫ్యాషన్ అందాల ప్రపంచంలో ముందడుగు వేశాయి!
ఫస్ట్ రన్నరప్ గా మిస్ ఇథియోపియా,
సెకండ్ రన్నరప్ గా మిస్ పోలెండ్ విజేతలుగా నిలిచారు. ఈసారి థర్డ్ రన్నరప్ స్థానాన్ని కూడా ప్రకటించారు. ఈ స్థానాన్ని మిస్ మార్టిరికా సుందరి గెలుచుకుంది.
మన భారత దేశం నుంచి పోటీపడిన నందిని గుప్తా టాప్ 8వ స్థానం కైవసం చేసుకుంది. సాంస్కృతిక ప్రదర్శనలో సంప్రదాయ పేరిణి నాట్యం ప్రపంచ దేశాల ఫ్యాషన్ ప్రియులకు కనువిందు చేసింది.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >