Posted on 2025-06-03 11:33:54
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడం బాధాకరమని *వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు* అన్నారు. పదేళ్ల పాలనలో అవినీతికి తావు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత కేసిఆర్‌దేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కేసిఆర్‌కు నోటీసులు జారీ చేసిందని, ఈ కేసు నుంచి కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటికి వస్తారన్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మండిపడ్డారు. ఎవరెన్ని లీకులు ఇచ్చినా బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందని, ప్రజల పక్షాన పోరాడుతుందని తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై అడ్డగోలుగా మాట్లాడడం సరికాదని, పార్టీ పైన దుష్ప్రచారాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల బడే బాయ్ చోటే బాయ్‌లను ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రశ్నిస్తామని అన్నారు. తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >