| Daily భారత్
Logo




బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు చేసిన పోలీసులు

News

Posted on 2025-06-03 11:37:14

Share: Share


బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు చేసిన పోలీసులు

డైలీ భారత్, డోర్నకల్: డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో డోర్నకల్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెడ్యానాయక్‌‌తో మరికొంతమంది నేతలపై పోలీసులు కేను నమోదు చేశారు.

డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత రెడ్యానాయక్‌పై  పోలీసులు ఇవాళ(మంగళవారం) కేసు నమోదు చేశారు. రెడ్యానాయక్‌తో సహా 17 మందిపై కేసులు పెట్టారు. నిన్న(సోమవారం) డోర్నకల్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలోనే పోలీసులు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో డోర్నకల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా సోమవారం నాడు డోర్నకల్ పట్టణంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా ర్యాలీ నిర్వహించారు. దీంతో డోర్నకల్‌లో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రెండు పార్టీల్లోని నేతలనూ నియంత్రించేందుకు పోలీసులు ఇబ్బంది పడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ఘర్షణతో డోర్నకల్ నియోజకవర్గం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.

పోలీసుల సూచనలు అతిక్రమించడంతో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైందని డోర్నకల్ పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం మరికొంతమందిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. పోలీసు కేసులతో డోర్నకల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిఒక్కరిని గుర్తుపెట్టుకుంటానని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తర్వాత అందరి సంగతి తెలుస్తానని రెడ్యానాయక్ కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. రాజకీయ కక్షల్లో భాగంగానే తమ పార్టీ నేతలపై పోలీసులు కేసు పెట్టారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. తమ నేతలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. అయితే ఇలాంటి పరిణామాలు ఇంకా కొనసాగితే డోర్నకల్ రాజకీయాలు మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు

Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >