Posted on 2025-06-08 22:02:41
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : దేశాభివృద్ధిలో అన్నదాతల ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల మాదిరిగానే ప్రత్యేక గుర్తింపు సంఖ్యను (Unique Farmer ID) అందించాలని నిర్ణయించింది.
ఆధార్ తరహాలో 11 అంకెలతో కూడిన ఈ "విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య"ను ప్రతి ఒక్కరికీ కేటాయించనున్నారు. తెలంగాణలో ఈ ప్రక్రియను వ్యవసాయ శాఖ ఏప్రిల్ 23 నుంచే ప్రారంభించింది. అయితే.. ఇప్పటికే గ్రామాల్లోని రైతువేదికల్లో నమోదు చేసుకున్న రైతులు తమ దరఖాస్తు స్థితి (అప్లికేషన్ స్టేటస్) ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రక్రియ ద్వారా మీ దరఖాస్తు ఆమోదం పొందిందా, పెండింగ్‌లో ఉందా లేదా తిరస్కరించబడిందా అనే పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ కింద సూచించిన స్టెప్స్‌ను అనుసరించండి
వెబ్ బ్రౌజర్‌ను తెరవండి.. మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్‌లో గూగుల్ క్రోమ్ (Google Chrome) వంటి ఏదైనా వెబ్ బ్రౌజర్‌ను తెరవండి. సెర్చ్ బార్‌లో agristack telangana అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు కొన్ని వెబ్‌సైట్‌లు కనిపిస్తాయి. వీటిలో మొదట కనిపించే అధికారిక వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.
వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత, పైన కనిపించే మెనూ బార్‌లో Dashboard, Check Enrollment Status, Login with CSC అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. వీటిలో మీరు "Check Enrollment Status" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు Enrollment ID (ఎన్ రోల్‌మెంట్ ఐడీ) లేదా Aadhaar Number (ఆధార్ నంబర్) అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. మీ దగ్గర ఉన్న ఎన్ రోల్‌మెంట్ ఐడీ లేదా ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి, దరఖాస్తు స్థితిని చెక్ చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు మీ ఎన్ రోల్‌మెంట్ నంబర్ వస్తుంది.
ఒకవేళ ఎన్ రోల్‌మెంట్ నంబర్ గుర్తులేకపోతే.. ఆధార్ నంబర్‌తోనూ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి.. చెక్ బటన్‌ను క్లిక్ చేసిన తర్వాత, మీ దరఖాస్తు ఆమోదించబడిందా (Approved), పెండింగ్‌లో ఉందా (Pending) లేదా తిరస్కరించబడిందా (Rejected) అనే వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ మీ దరఖాస్తు తిరస్కరించబడితే, వెంటనే సంబంధిత వ్యవసాయాధికారులను సంప్రదించి, కారణాలు తెలుసుకొని, సరిదిద్దుకోవాలి.
ప్రయోజనాలు, నమోదు ప్రక్రియ
ఈ విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య ద్వారా రైతులు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని వ్యవసాయ పథకాలకు లబ్ధి పొందవచ్చు. ముఖ్యంగా, వచ్చే సంవత్సరం నుంచి "పీఎం కిసాన్ సమ్మాన్ నిధి" లబ్ధిదారులు తప్పకుండా ఈ ప్రత్యేక గుర్తింపును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో మీసేవ కేంద్రాల ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉండగా, తెలంగాణలో మాత్రం వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవోలు) నేరుగా గ్రామాలకు వెళ్లి నమోదు ప్రక్రియను చేపడుతున్నారు. అన్ని స్థాయిల అధికారులు (ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు) ఇప్పటికే అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో ఏఈవోలు ప్రతి రైతు వద్దకు వెళ్లి వారి బయోడేటాను, రైతు పేరిట ఉన్న భూమి వివరాలను రెవెన్యూ శాఖ నుంచి సేకరిస్తారు.
రైతుల ఆధార్ సంఖ్యను, మొబైల్ నంబరుతో అనుసంధానం చేస్తారు. నమోదు సమయంలో రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్ కార్డు, ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్ నంబరును తప్పకుండా తీసుకురావాలి. ఏఈవోలు ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన యాప్‌లో వివరాలు నమోదు చేస్తారు. నమోదు అనంతరం రైతుల మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది, దాన్ని యాప్‌లో నమోదు చేస్తే వెంటనే విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య జనరేట్ అవుతుంది. రైతులు ఈ సంఖ్యను భద్రంగా ఉంచుకోవాలి. తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాలో ఈ ప్రక్రియ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా ఎన్ రోల్ మెంట్ ప్రక్రియలో చివరి స్థానంలో ఉండగా.. మొదటి స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా నిలిచింది. 15 వేలకు పైగా దరఖాస్తులను పెండింగ్ లో పెట్టగా.. ఇప్పటి వరకు 6.50 లక్షలకు పైగా రైతుల ఎన్ రోల్‌మెంట్ పూర్తయినట్లు వెబ్ సైట్లో పొందుపరిచారు.
రైతుల భవిష్యత్తు భద్రత
ఈ సంఖ్య భవిష్యత్తులో కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీలు, విత్తన పంపిణీ, రుణ సాయం వంటి పథకాలన్నింటికీ కీలక ఆధారంగా ఉపయోగపడుతుంది. కాబట్టి, రైతులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు, పాసుబుక్‌లలో ఉన్న వివరాలు కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఎలాంటి భూమి వివాదాలు ఉంటే ముందుగా పరిష్కరించుకోవడం మంచిది. మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉండటం తప్పనిసరి.
లేకపోతే రిజిస్ట్రేషన్ నిలిపివేయబడుతుంది. ప్రభుత్వం రైతులకు మరింత అవగాహన కల్పించడానికి గ్రామస్థాయిలో చైతన్య ర్యాలీలు, మోటివేషన్ సమావేశాలు నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. దీని ద్వారా ప్రతి రైతు అవసరమైన డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకుని సకాలంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేలా ప్రోత్సహించనున్నారు. మరింత సమాచారం కోసం రైతులు తమ గ్రామ ఏఈవోను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య రైతులకు ఒక కొత్త గుర్తింపును, అనేక ప్రయోజనాలను చేకూర్చనుంది.
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >