| Daily భారత్
Logo




గంజాయి వివాదంలో చిక్కుకున్న సింగర్ మంగ్లీ?

News

Posted on 2025-06-11 18:56:16

Share: Share


గంజాయి వివాదంలో చిక్కుకున్న సింగర్ మంగ్లీ?

మంగ్లీపై కేసు నమోదు చేసిన పోలీసులు

డైలీ భారత్, హైదరాబాద్: ప్ర‌ముఖ సింగ‌ర్ మంగ్లీ పుట్టి రోజు వేడుక‌ల్లో గంజాయి క‌ల‌క‌లం రేగింది. ఈ వేడుక‌ ల్లో భారీగా గంజాయి, విదేశీ మ‌ద్యాన్నిపోలీసులు స్వాధీనం చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీకి హాజ‌రైన ప‌లువురికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా డ్ర‌గ్స్ పాజిటివ్‌గా తేలిన‌ట్లు స‌మాచారం.

సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు జూన్ 10 పదవ తేదీ మంగళవారం నిర్వహించగా.. అదే మంగళవారం సాయంత్రం ఆమె చేవెళ్ల‌లోని త్రిపుర రిసార్టులో బ‌ర్త్ డే పార్టీని ఇచ్చింది. కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు, సినీ ఇండ‌స్ట్రీకి చెందిన వారు మొత్తం 48 మంది వ‌ర‌కు ఈ పార్టీకి హాజ‌రు అయ్యార‌ని తెలుస్తోంది. 

 పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఈ రిసార్టు పై అర్థ‌రాత్రి రెండు గంట‌ల త‌రువాత ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వ‌హించారు.ఈ దాడుల్లో 48 మందికి గంజాయి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 9 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. 

దీంతో ఎన్‌డీపీఎస్ యాక్ట్‌, సౌండ్ పొల్యూష‌న్ యాక్ట్ కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు.గంజాయి తీసుకుంటూ దామోదర్ అనే వ్య‌క్తి ప‌ట్టుబ‌డిన‌ట్లుగా తెలుస్తోంది. అనుమతి లేకుండా బర్త్ డే పార్టీని నిర్వ‌హించ‌డం...

దీంతోపాటు గంజాయి, విదేశీ మ‌ద్యం, దొర‌క‌డంతో ఫోక్ సింగర్ మంగ్లీ, త్రిపురా రిసార్ట్ జిఎం శివరామకృష్ణ ల పై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా డీజేప్లే చేసినందుకు డిజేను పోలీసులు సీజ్ చేశారు.

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >