Posted on 2025-06-17 18:53:08
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: మినిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ -న్యూ ఢిల్లీ వారు ఆన్లైన్ ద్వారా నిర్వహించిన, జాతీయ స్థాయి స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్-2025 వైజ్ఞానిక ప్రదర్శన ల్లో అద్భుత ప్రతిభను చూపిన, అత్యుత్తమ 27 ఆవిష్కరణల జాబితాను ప్రకటించగా ,దమ్మన్నపేట్ ప్రభుత్వ పాఠశాల 9వ తరగతి విద్యార్థినిలు మాలోత్ సుప్రియ, ఈరబోయిన శ్రీ చైత్ర, ఈరబోయిన మధుప్రియ లు ,గైడ్ టీచర్ తాడూరి సంపత్ కుమార్ మార్గ దర్శకం లో తయారు చేసిన స్మార్ట్ వాష్ బేసిన్ అనే ఆవిష్కరణ ఎంపిక చేసిన టాప్ 27 ఆవిష్కరణలో ఒకటిగా నిలిచింది
గత సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ వైజ్ఞానిక పోటీల్లో, దేశ వ్యాప్తంగా ఒక లక్ష ఇరవై వేల మంది విద్యార్థులు పాల్గొనగా, online ద్వారా 8 దశల్లో పోటీలు నిర్వహించి అత్యున్నత ప్రతిభ చూపిన 27 ఆవిష్కరణల జాబితాను ఈ నెల 15 ప్రకటించారు. అన్నీ దశల్లో చక్కటి ప్రతిభను చూపి top 27 కు సెలెక్ట్ అయినందుకు గాను,విద్యార్థులను, ఉపాధ్యాయులను మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వర రావు ను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అభినందనలు తెలియజేసారు, పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ,విద్యార్థులను మరియు వారిని ప్రోత్సహించిన గైడ్ టీచర్ ను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు జ్ఞాపికలను అందజేసి ఘనంగా సత్కరించారు
ఈ విద్యార్థులు గైడ్ టీచర్ తో కలిసి జులై 29 న,ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో, ఢిల్లీలో ని ప్రగతి మైదాన్ లో నిర్వహించనున్న ప్రోగ్రాం లో తమ ఇన్నోవేషన్ ను ప్రదర్శిచనున్నారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >