| Daily భారత్
Logo




ప్రియుడితో కలిసి తండ్రిని హతమార్చిన తల్లి కూతుర్లు

News

Posted on 2025-06-19 10:10:11

Share: Share


ప్రియుడితో కలిసి తండ్రిని హతమార్చిన తల్లి కూతుర్లు

డైలీ భారత్, మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. కుమార్తె ప్రేమకు తండ్రి అడ్డుగా నిలిచాడు. ఇది ఆయన భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో భార్య, ఇద్దరు కుమర్తెలు, ప్రియుడుతో కలిసి కన్నతండ్రిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

జిల్లాలోని మరిపెడ మండలం డీఎస్ఆర్ జెండాల్ తండాకు చెందిన ధరావత్ కిషన్ (40) అనే వ్యక్తికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం కిషన్ చిన్న కుమార్తె పల్లవి అదే తండాకు చెందిన భూక్య సురేశ్ అనే యువకుడితో తరచూ ఫోనులో మాట్లాడుతుండటాన్ని గమనించాడు. ఈ విషయంపై కుమార్తెను కిషన్ మందలించాడు. దాంతో తన ప్రేమను తండ్రి అంగీకరించడం లేదని పల్లవి తీవ్ర ఆగ్రహానికి గురైంది. 

ఈ క్రమంలోనే కిషన్ భార్య కావ్య, ఇద్దరు కుమార్తెలు రమ్య, పల్లవి, ఆమె ప్రియుడు భూక్య సురేశ్, మరో ఇద్దరు యువకులు బోడ చందు, దేవేందర్ కలిసి కిషన్‌పై దాడికి పాల్పడ్డారు. అందరూ కలిసి కిషన్‌ను తీవ్రంగా కొట్టడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలపాలైన కిషన్‌ను  మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించరు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కిషన్ ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనపై మృతుడు కిషన్ తల్లి సాంకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కిషన్ భార్య కావ్య, కుమార్తెలు రమ్య, పల్లవి, పల్లవి ప్రియుడు భూక్య సురేశ్‌తో పాటు దాడిలో పాల్గొన్న బోడ చందు, దేవందర్‌లపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రాజ్‌కుమార్ గౌడ్ తెలిపారు. కుటుంబ కలహాలు, ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఇంతటి దారుణానికి దారితీయడం స్థానికంగా కలకలం రేపింది.

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >