| Daily భారత్
Logo




యాంటీ డ్రగ్ డేలో భాగంగా విద్యార్థులతో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ

News

Posted on 2025-06-26 10:11:38

Share: Share


యాంటీ డ్రగ్ డేలో భాగంగా విద్యార్థులతో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ

డ్రగ్స్ కు దూరంగా ఉండాలి.. ఉన్నత స్థానాలకు ఎదగాలి

భవిష్యత్తు తరాల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి లక్ష్యం : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

విద్యార్థులు యువత డ్రగ్స్ కు దూరంగా ఉంటూ యాంటీ డ్రగ్ సోల్జర్గా మారాలి:జిల్లా ఎస్పీమహేష్ బి.గితే.

హాజరైన కలెక్టర్,ఎస్పీ , అధికారులు

వ్యాసరచన,చిత్రలేఖన పోటీల్లో విజేతకు ప్రశంసా పత్రాలు, పతకాలు అందజేత.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: విద్యార్థులు,యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని,ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు.యాంటీ డ్రగ్ డే సందర్భంగా మత్తుపదార్థాల నిర్మూలన వారోత్సవాలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,ఎస్పీ మహేష్ బి గితే, విద్యార్థులు,పోలీస్ అధికారులతో కలిసి గురువారం సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ నుంచి పద్మనాయక ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ తీశారు. 


ప్రజలను ఆకట్టుకుంటూ ఆలోచింపచేసేలా ఉన్న గంజాయి రహిత సమాజం–మనందరిదీ బాధ్యత , డ్రగ్స్‌కి నో చెప్పండి. ఆరోగ్యమే అసలైన సంపద  వంటి ఫ్లకార్డ్స్, నినాదాలు చేశారు.

డ్రగ్స్,గంజాయిని నిర్మూలించేందుకు బాధ్యత గల పౌరులుగా వ్యవహరించి డ్రగ్స్,గంజాయి నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని ప్రజలు,యువతకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్, ఎస్పీ.


ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ... 

విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి  పక్కా ప్రణాళిక ప్రకారం చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ ను వినియోగించి సమాజానికి ఇబ్బంది కలిగించే పౌరులుగా మారవద్దని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగంతో మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయని రాను రాను ఆరోగ్యం  క్షీణిస్తుందని వివరించారు. డ్రగ్స్ వినియోగంతో శారీరకంగానే కాకుండా మానసిక ఇబ్బందులు, సామాజిక రుగ్మతలు తలెత్తుతాయని తెలిపారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ డ్రగ్స్ తో కలిగే నష్టాలపై అవగాహన ఉండి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఉత్తమ సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. 


అనంతరం ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ

విద్యార్థులు, యువత తమ పరిసరాలు,విద్యాలయాలు ఇతర చోట్ల ఎక్కడైనా డ్రగ్స్ వినియోగించినా.. విక్రయించినా.. తరలించనా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. డ్రగ్స్ రహిత సమాజంతో మన రాష్ట్రం అలాగే దేశం ఉన్నతంగా ఉంటుందని పేర్కొన్నారు.విద్యార్థులు యువత డ్రగ్స్ కు దూరంగా ఉంటూ యాంటీ డ్రగ్ సోల్జర్గా మారాలని ఆకాంక్షించారు. 

యాంటీ డ్రగ్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన ఇతర పోటీల్లో విజేతలకు ప్రశంసా పత్రాలు, పత కాలను కలెక్టర్,ఎస్పి తదితరులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులు అంతా కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఫంక్షన్ హాల్ ఆవరణలో వివిధ పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ ను పరిశీలించారు. విద్యార్థులు గీసిన చిత్రాలు.. తయారు చేసిన పెయింటింగ్ లను చూసి కలెక్టర్, ఎస్పీ వారిని అభినందించారు. 

అనంతరం యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పై యాంటీ డ్రగ్ సోల్జర్ గా కలెక్టర్,ఎస్పీ,అధికారులు , విద్యార్థులు సంతకాలు చేశారు.

ఈకార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి,అదనపు ఎస్పీ చంద్రయ్య, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సి.ఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, నతేష్,మధుకర్, నాగేశ్వరరావు, ఆర్.ఐ లు రమేష్, మధుకర్, యాదగిరి, ఎస్.ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >