Posted on 2025-06-26 10:20:20
పిల్లల పెంపకం తల్లిదండ్రుల బాధ్యత
డ్రగ్స్ కు బానిసలకు కాకుండా ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలి
డైలీ భారత్, న్యూస్ మెదక్:అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ . రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ. డి. వి. శ్రీనివాస రావు ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుండి రాందాస్ చౌరస్తా వరకు సే నో టు డ్రగ్స్, సేవ్ టు లైఫ్, మత్తు పదార్థాలను సేవించడం ఆరోగ్యానికి హానికరం, అని నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ . డి. వి. శ్రీనివాస రావు మాట్లాడుతూ
డ్రగ్స్ మత్తులో యువత నేరలకు పాలపుడు తున్నారని అన్నారు. డ్రగ్స్ కు బానిసలైన వారిని రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలిస్తాం. మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించే లక్ష్యంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి.
ప్రతి ఒక్కరు మాధకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, భవిష్యత్తు రోజుల్లో మాధకద్రవ్యాల నిర్మూలన నేటి తరం విద్యార్థుల చేతిలోనే ఉంది అని అన్నారు. విద్యార్థుల దృష్టి తమ భవిష్యత్తు జీవిత లక్ష్యం పై మాత్రమే ఉండాలని, నిషేధిత గంజాయి డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని ఎస్పీ సూచించారు.
గంజాయి డ్రగ్స్ అలవాటు వలన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని కావున చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
యువత పురోగతికి, భావి జీవితానికి అవరోధంగా నిలుస్తూన్న మాధకద్రవ్యాలను సమాజం నుండి సమూలంగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని విజ్ఞప్తి చేశారు. జిలాల్లో గంజాయి, డ్రగ్స్ నిర్ములనకు జిల్లాలోని కళాశాలలో, పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు కళ బృందం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే డయల్ 100,1908, పోలీస్ వారికి అందించాలని సూచించారు.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >