Posted on 2025-06-26 18:12:13
మూడు సెల్ ఫోన్స్, 30,000/- రూపాయలు స్వాధీనం.
వివరలు వెల్లడించిన సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన JCB ఓనర్లకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి వేములవాడలో గల అగ్రహారంలో కొత్తగా వెంచర్ వేస్తున్నారని అందులో చెట్లను చదును చేయడానికి జెసిబి కావాలని అందుకాను ముందస్తుగా ఎంట్రీ ఫీజు కోసం 9000 రూపాయలు ఇవ్వవలసి ఉంటుందని మాయమాటలు చెప్పి నమ్మించి డబ్బులు స్కానర్ ద్వారా పంపించుకున్నారని, తరువాత అట్టి వ్యక్తులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని తెలిపి తము మోసపోయానని గ్రహించి తంగాళ్ళపల్లి మండలం గండిలచ్చక్కపేట గ్రామానికి చెందిన మాల్యల శ్రీనివాస్ అనే వ్యక్తి పిర్యాదు మేరకు తంగళ్ళపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఆట్టి నేరస్తులను చాకచక్యంగా వ్యవహరించి పట్టుకుని విచారించగా వీరితో పాటుగా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో ఇద్దరిని,ఎల్లారెడ్డిపేట మండలంలోని అగ్రహారం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని ఇదేవిధంగా మోసం చేసి వారి వద్ద నుండి డబ్బులు తీసుకున్నామని వారు నేరం ఒప్పుకున్నారు.ఇద్దరు నింధితులను అరెస్ట్ చేసి వీరి వద్ద నుండి మూడు సెల్ ఫోన్లు మరియు 30,000/- రూపాయలు స్వాధీనం చేసుకోని ఈరోజు వారిని కోర్టుకు రిమాండ్ కు తరలించడం జరిగిందని సీఐ తెలిపారు
నిందుతుల వివరాలు.
1) గోల్కొండ చందు కుమార్ S/o రామచంద్రం, వయసు 28 సంవత్సరంలు, కులం మాదిగ, గ్రామం & మండలం. బాలాపూర్, జిల్లా రంగారెడ్డి.
2) చింతపట్టి పవన్ కుమార్ S/o రవీందర్, వయసు 25 సం..లు, కులం SC మాదిగ, గ్రామం & మండలం బాలాపూర్ జిల్లా రంగారెడ్డి.
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >