| Daily భారత్
Logo




పూరీ జగన్నాథుని రథయాత్ర.. భారీగా భద్రతా ఏర్పాట్లు

News

Posted on 2025-06-27 08:54:50

Share: Share


పూరీ జగన్నాథుని రథయాత్ర.. భారీగా భద్రతా ఏర్పాట్లు

డైలీ భారత్, పూరి: ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుని రథ యాత్ర మరి కొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రను కన్నులారా చూడటానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు.

ఇక, లక్షలాది మంది భక్తులు ఈ రథాల వెంటరాగా జగన్నాథుడి భారీ ఆలయ ప్రాంగణం నుంచి అక్కడికి 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరానికి రథాలపై తరలి వెళ్లనున్నారు. ఆలయ పరిసరాలన్నీ ఒక్కసారిగా భక్తులతో నిండిపోయాయి. ఈ వేడుకలో సుమారు 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేసిన అధికారులు.. అందుకు తగినట్లుగా ఏర్పాట్లను చేశారు.

అయితే, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి భద్రతకు ప్రాధాన్యమిచ్చింది. ఈసారి ఏకంగా 275 ఏఐ కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టారు. దీంతో పాటు 10 వేల మంది జవాన్లను సర్కార్ నియమించింది. భూతల, జల, వాయు మార్గాలపై నిఘా ఉంచినట్లు ఒడిశా డీజీపీ యోగేష్‌ బహదూర్‌ ఖురానియా వెల్లడించారు. అలాగే, భద్రతతో పాటు వైద్య సేవలకూ ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీఠ వేసింది. ఈ ఏడాది రథయాత్ర సందర్భంగా 69 తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలు, 64 అంబులెన్స్‌లు, 265 ప్రత్యేక ఆసుపత్రి పడకలు, 378 అదనపు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది డ్యూటీలో ఉండనున్నారు. ఏఐఎమ్ఎస్ భువనేశ్వర్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఈసారి పూరీలోని రథయాత్ర వద్ద విధులు నిర్వహించనున్నారు. యాత్రను భద్రంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు భక్తుల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.


#puri #ratha Yatra #yatra 

Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >