| Daily భారత్
Logo




బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్ 100 కు సమాచారం అందించండి :ఎస్పి సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

News

Posted on 2025-06-30 19:40:57

Share: Share


బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్ 100 కు సమాచారం అందించండి :ఎస్పి సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్ 100 కు సమాచారం అందించండి.

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి చిన్న పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్ కేసులు నమోదు.

జిల్లా ఎస్పి సుధీర్ రాంనాధ్ కేకన్ IPS.

డైలీ భారత్, మహబూబాబాద్: జూలై 1 నుండి 31వ తారీఖు వరకు వరకు నిర్వహించే ఆపరేషన్ ముష్కాన్ -XI లో భాగంగా ఆపరేషన్ ముష్కాన్ పోస్టర్స్ ను విడుదల చేసిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS మరియు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు.

జిల్లాలోని రెండు సబ్ డివిజన్లయిన మహబూబాబాద్, తొర్రుర్ సబ్ డివిజన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సమన్వయంతో విధులు నిర్వర్తించి, జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం కోసం కృషి  జరుగుతుందని ఈ సందర్బంగా ఎస్పీ తెలిపారు. ఆపరేషన్ ముష్కాన్ XI కి సంబందించిన వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశ నిర్వహణతో పాటు,వివిధ విభాగాల అధికారులతో కలిసి ఆపరేషన్ ముష్కాన్ XI పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి  ఆపరేషన్ ముష్కాన్ XI కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని,18 సంవత్సరాల లోపు తప్పిపోయిన, కిరాణం షాపులు, మెకానిక్ షాపులలో, హోటళ్లలో, ఫ్యాక్టరీ లలో పనిచేస్తున్న బాల కార్మికులను మరియు వదిలివేయబడిన పిల్లలను, రోడ్డుపై  భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి, వారికి అప్పగించడం లేదా చైల్డ్ కేర్ హోమ్ కు పంపించడం జరుగుతుందన్నారు. చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా బిక్షాటన మరియు వెట్టి చాకిరీ చేయించిన వారిపై నూతన చట్టాలను అనుసరించి క్రిమినల్ కేసులు నమోదు నమోదు చేయడం జరుగుతుందని ఎస్పి గారు హెచ్చరించారు. బాలల హక్కుల సంరక్షణ ద్వారానే సంపూర్ణ మానవ అభివృద్ది సాధ్యమవుతుందని, ఆ దిశగా అధికారులు సమన్వయంతో పక్కా ప్రణాళిక రుపొందించుకోని, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ పేర్కొన్నారు.

జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికుల కనిపిస్తే 1098, డయల్ 100కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చిన్నపిల్లలు వెట్టిచాకిరి కి గురికాకుండా వారి ముఖాల్లో చిరునవ్వులు చిందించేలా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని భాద్యతగా నిర్వర్తించాలని సూచించారు.    

ఈ కార్యక్రమంలో డీఎస్పీలు సత్యనారాయణ, G. మోహన్, సిఐలు హతిరాం, G.మహేందర్ రెడ్డి ఎస్. బి సీఐ చంద్రమౌళి, CWC ఛైర్పర్సన్ నాగవాణి,  చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ వెంకటేష్, సూపర్వైజర్ కళ్యాణి, DCPU కౌన్సిలర్ రమేష్, షేర్ NGO హిమ బిందు  ఆపరేషన్ ముష్కాన్ XI టీంలు పాల్గొన్నారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >