Posted on 2025-07-04 11:39:31
ఇబ్బందుల్లో గుండె సంబంధిత పేద రోగులు
గతంలో పనిచేసిన సూపరిండెంట్ ప్రతిమ రాజ్ వెళ్ళినప్పటి నుండి సమస్యల వలలో జిల్లా పెద్దాసుపత్రి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటుచేసిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గుండె సంబంధిత వైద్యుడు లేకపోవడం రోగులను ఇబ్బందులకు గురిచేస్తుంది. గత నెల రోజులుగా గుండెకు సంబంధిత వైద్యుడు లేకపోయినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిలువుద్దంగా నిలిచింది. నిజామాబాద్ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుండి భారీగా ప్రతిరోజు వేల సంఖ్యలో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తుంటారు. ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా అనేకమందికి గుండె వ్యాధి సమస్య వేధిస్తుంది. ధనికులు ప్రవేట్ ఆస్పత్రికి వెళుతుంటే, నిరుపేదలు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి నమ్ముకుని ఇక్కడికి వస్తుంటారు. తీరా ఇక్కడికి వచ్చాక గుండెకు సంబంధించిన వైద్యుడు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరిండెంట్ గా విధులు నిర్వహించిన ప్రతిమరాజ్ వారానికి ఒకసారి తాను ఉన్నప్పుడు అన్ని శాఖల వైద్యులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. ఎప్పుడైతే ఆమె పరిస్థితుల ప్రభావంతో బయటకు వెళ్లినప్పటికీ నుండి జిల్లా పెద్ద ఆసుపత్రిలో రోగులకు కనీస సౌకర్యాలు కరువుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసుకొని ప్రవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఇక్కడ పనిచేసిన కార్డియాలజిస్ట్ రవికుమార్ ను విధుల నుంచి తొలగించారు. రవికుమార్ బాధ్యతలు స్వీకరించక ముందు నెలల తరబడి కార్డియాలజిస్ట్ పోస్ట్ ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఆస్పత్రి సూపర్డెంటెంట్ గా ఐదు నెలల క్రితం బాధ్యతలు శ్రీనివాస్ ప్రత్యేక దృష్టి సారించి రవికుమార్ ను నియమించారు. ముచ్చటగా మూడు మాసాలకే రవికుమార్ ను విధుల్లోంచి తొలగించడంతో కొత్తవారిని నియమించకుండ అధికారులు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారు. ఇటీవల కాలంలో గుండె వ్యాధికి సంబంధించి అనేక మంది యువకులు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. పేదలకు మాత్రం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి లో గుండె సంబంధిత వైద్యం అందని ద్రాక్షగా తయారైంది.
అయితే ఇటీవల జిల్లాకు నూతనంగా బదిలీపై వచ్చిన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వినయ్ కృష్ణారెడ్డి జిల్లా ఆస్పత్రి పై దృష్టి సారించి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో శాశ్వత కార్డియాలజిస్ట్ వైద్యుని నియామకానికి చొరవ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >