Posted on 2025-07-05 15:42:24
డైలీ భారత్, బాచుపల్లి: ఈ మధ్య ప్రియుడి కోసం భార్యలు భర్తలను కృరంగా హతమారుస్తున్న ఘటనలు వెలుగు చూస్తేనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ ఘటన తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు కట్టుకున్న భర్తని దారుణంగా హత్య చేసింది ఓ భార్య. భర్తను హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేసింది. తాగిన మత్తులో ఉన్న భర్త ఛాతిపై కూర్చొని గొంతు నులిమి కిరాతకంగా చంపింది.
కర్ణాటక సరిహద్దులోని నారాయణపేట జిల్లా(మండలం) కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప(32)కు ధన్వాడ మండలం రాంకిష్టయ్య పల్లి గ్రామానికి చెందిన రాధతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌లోని బాచుపల్లికి వచ్చారు. ఇక్కడే కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంతలో రాధ ధన్వాడకు చెందిన ఓ యువకుడితో వివాహేతర బంధం పెట్టుకుంది. ఈ విషయం కాస్త అంజిలప్పకు తెలిసింది. దీంతో ఆ యువకుడితో మాట్లాడొద్దని అంజిలప్ప రాధను మందలించాడు. ఆపై స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో ఆగి ఇంటికి వెళితే.. పరువు పోతుందని, వేరేచోట పని చూసుకుందామని రాధ పట్టుబట్టింది. దీంతో తిరిగి హైదరాబాద్ వెళ్లారు. బాచుపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్ వద్ద పనిచేస్తూ గుడిసెలో ఉంటున్నారు. గత నెల 23న తాగిన మత్తులో ఉన్న భర్త అంజిలప్ప పడుకుని ఉండగా.. గొంతు నులిమి హత్య చేసింది.
తన భర్త అకస్మాత్తుగా చనిపోయాడని అందరినీ నమ్మించింది. అంత్యక్రియల కోసం భర్త మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లింది. మృతదేహం గొంతుపై ఉన్న గాయాలు గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టంలో గొంతుపై ఒత్తిడి వేయడం వల్ల అంజిలప్ప మరణించినట్లు తేలింది. దీంతో భార్యను అనుమానించిన పోలీసులు.. తమదైన స్టైల్ లో విచారించారు. భర్తను తానే చంపినట్లు భార్య రాధ ఒప్పుకుంది. తన ప్రియుడితో మాట్లాడ వద్దని మందలించడం వల్లనే చంపానని చెప్పింది. ఆమెను అరెస్ట్ చేసిన బాచుపల్లి పోలీసులు రిమాండ్ కు తరలించారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >