| Daily భారత్
Logo




రుద్రూర్ మండలం మోడల్ కళాశాల వసతి గృహంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

News

Posted on 2025-07-05 20:25:03

Share: Share


రుద్రూర్ మండలం మోడల్ కళాశాల వసతి గృహంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

జిల్లాలోని రుద్రూర్ మండలం మోడల్ కళాశాల వసతి గృహంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

పలువురు విద్యార్థులకు తీవ్ర అస్వస్థత ఆసుపత్రికి తరలింపు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అంబం గ్రామ శివారులో గల మోడల్ కళాశాల వసతి గృహంలో విద్యార్థినీలకు శుక్రవారం రాత్రి ఫుడ్ పాయిజన్ అయ్యి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అందులో ఎనిమిది మంది విద్యార్థినిలను వర్ని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మోడల్ కళాశాల వసతి గృహంలో 120 మంది విద్యార్థినీలు ఉన్నారు. అందులో 97 మందికి తినకముందు (బ్రేక్ ఫాస్ట్) ఐరన్ మాత్రలు ఇచ్చారని తెలిసింది. ఆ తరువాత భోజనం చేయగా 8 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థకు గురి కాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థినీలు తినకుండా ఐరన్ ట్యాబ్లేట్ లు వేసుకోవడం వలననే ఈ పరిస్థితి తలెత్తిందని వైద్యులు నిర్ధారించారు. వసతి గృహంలో విద్యార్థినీలు బ్రేక్ ఫాస్ట్ చేయకున్న పట్టించుకునే నాథుడు లేడని స్పష్టం అవుతుంది. మోడల్ కళాశాల వసతి గృహం బాధ్యతలు కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్ లకు అప్పగించగా వారు అధిక పని భారం పేరిట పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. చదువు చెప్పడం వరకే మోడల్ కళాశాల బాధ్యత అని, హస్టల్ విషయం ఎస్ఓలకు తెలుసని ఒకరిపై ఒకరు తోసేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. హస్టల్ ఎస్ఓతో పాటు ఏఎన్ఎం నిర్లక్ష్యం మూలంగా విద్యార్థినీలకు ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రాథమికంగా తేలింది. డీఈఓ వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినిల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు భైరాపూర్ రవీందర్ గౌడ్ , పుట్ట భాస్కర్ కోరారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >