| Daily భారత్
Logo




భద్రాచలం దేవస్ధానం EO పై దాడి చేసిన వారిని కటినంగా శిక్షించాలి

News

Posted on 2025-07-10 16:58:23

Share: Share


భద్రాచలం దేవస్ధానం EO పై దాడి చేసిన వారిని కటినంగా శిక్షించాలి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నగరంలోని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయం లో జరిగిన సమావేశం లో విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..

భద్రాచలం దేవస్థానం ఈవోపై ఆంద్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పురుషోత్తమపట్నం గ్రామస్థులు దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అనీ దీనిని విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు, ఒక భక్తుడు భద్రాద్రి రామయ్య కు సమర్పించిన 900 ఎకరాల భూమిని పురుత్తమపట్నం లోని కొందరు కబ్జా దారులు కబ్జ చేసి అనేక అక్రమ కట్టడాలు నిర్మాణాలు నిర్మించారు, కొన్నాళ్ళు క్రితం దేవస్థానం నిర్మించిన గోశాలని కూడా అడ్డుకున్న సమయంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున ఉద్యమించడం జరిగింది, ఆంద్రప్రదేశ్ హైకోర్టు కూడా దేవస్థానం భూములను దేవస్థానానికి వెంటనే అప్పగించాలని ఆదేశించినా అప్పటి జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు, మళ్ళీ గత రెండు రోజుల క్రితం పురుషోత్తపట్నలోని దేవస్థానం భూములలో కబ్జా దారులు అక్రమ నిర్మాణాలు చెపట్టారని సమాచారం తెలుసుకుని వారి సిబ్బంది తో వెళ్ళగా అక్కడి కబ్జా దారులు దేవస్థానం ఈవో మరియు సిబ్బంది పై దాడి చేయడం దుర్మగమైన, హేయమైన చర్య అని దీనిని విశ్వహిందూ పరిషత్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తందని అన్నారు, ఈఓ పై దాడి చేసిన వారిని కటినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుందని అన్నారు, తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాలు కల్పించుకుని దేవస్థానం భూములు దేవస్థానానికి అప్పజెప్పాలనీ లేదంటే విశ్వహిందూ పరిషత్ పెద్దఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు,

ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు చిలుకూరి నాగేశ్వరరావు , కొత్తగూడెం నగర కార్యదర్శి అగుళ్ళ యాకయ్య, కొత్తగూడెం నగర సహ కార్యదర్శి నాగుల రవి కుమార్ పాల్గొన్నారు.

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >