| Daily భారత్
Logo




ప్రభుత్వం జర్నలిస్టులకు జీవనభృతుని కల్పించాలి : ఇండ్ల మహేష్

News

Posted on 2023-12-16 17:37:37

Share: Share


ప్రభుత్వం జర్నలిస్టులకు జీవనభృతుని కల్పించాలి : ఇండ్ల మహేష్

డైలీ భారత్, తెలంగాణ: అక్షరం అనే ఆయుధం తూటా కన్నా పదునైనది. ఏ వ్యవస్థలోనైనా అవినీతి చేయాలని ఆలోచన వస్తే చాలు వామ్మో జర్నలిస్టుల కంట్లో పడ్డామా ఇంకా ఏమైనా ఉందా! అనే కోణాన్ని కలిగి ఉన్న (4వ పిల్లర్) జర్నలిజం.

 జర్నలిజం కత్తి మీద సాము లాంటిది

 ఒక తల్వార్  నిలువుగా ఉంటే అది తగిలితే గాయం అవుతుందని తెలిసిన,  దానిపై నడుస్తూ కలం అనే ఆయుధంతో ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు సాగుతూ,  ఆ పదునైన తల్వార్ తన శరీరాన్ని గాయ పరుస్తున్న ,  తన శరీరంలో నుండి రక్తం భూమి పాలు అవుతుందని తెలిసిన ప్రమాదానికి ఎదురు నడుస్తూ తన కలం అనే ఆయుధంతో తన కంటి ముందు ఉన్న సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తూ,  ఎన్నో ఒత్తిడళ్లకు తలవంచకుండా, మార్పు దిశగా సమస్యలను ఎల్లవేళలా తన కలంతో (ప్రింట్ మీడియా), తన గలంతో ( ఎలక్ట్రానికల్ మీడియా) ద్వారా సమస్యలను వెలిగెత్తి తెలియపరుస్తూ,  సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తూ, ప్రపంచంలో వెలుగులు తీసుకు వచ్చేందుకు నిరంతరం కృషి చేసే ది కేవలం జర్నలిస్టు.

అనే నా అభిప్రాయం

జీత బత్యాలు లేకపోయిన జర్నలిస్ట్ అనిపించు కోవాలనే మక్కువతో ఎంతోమంది యువత ఈ వృత్తిలోకి వస్తు ప్రశ్నించే గొంతులు పెరుగు తుండడం గమనార్థం.

 మరి కొత్తగా వస్తున్న జర్నలిస్టులకు సీనియర్ జర్నలిస్టుల అనుభవాలను తెలియపరిచి వారి అనుభవాన్ని జూనియర్లకు తెలియపరిచే సీనియర్ జర్నలిస్టులు మౌనం వహిస్తుండడం బాధాకరం. ప్రజలకు సమస్యలు కనబడు తున్న ఎవరో రావాలి మార్పు తేవాలి అనుకుంటూ నా కెందుకులే,  నా కుటుంబం మాత్రమే బాగుంటే చాలు అనుకునే రోజులు ఇవి, అలాంటి సమస్యలకు ఎదురు వెళ్తే ప్రాణహాని ఉందని తెలిసినా కేవలం జర్నలిస్టులు మాత్రమే  మార్పు మేము మాత్రమే ప్రపంచానికి తెలియ పరచగలం,  సమస్య పరిష్కారానికి మేమే ముందు వరసలో నిలబడతాం అంటూ ఉండే వ్యక్తులే విలేకరులు.

ఎప్పటి కప్పుడు కొత్త సమాచారాన్ని మేమే ముందు ప్రపంచానికి తెలియపరచాలని వృత్తిమీద మమకారంతో విలేకరులు కోడి కూసిన సమయం    నుండి ప్రజలు మేలుకునే లోపే కలం అనే ఆయుధంతో  అక్షరాల రూపంలో ప్రపంచాన్ని మేలుకొలుపుతూ మార్పు కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుండడంతో కుటుంబ సభ్యుల వద్ద ఎన్నో మాటలు పడుతున్న జర్నలిజం  వృత్తిమీద ప్రేమ మమకారాలతో అడుగులు వేస్తూ నిజాలను నిక్కాస్గా వెలుగెత్తుతూ కొనసాగుతున్న జర్నలిస్టులకు  ప్రేమతో నా హృదయపూర్వక అభినందనలు.

 జర్నలిస్టు వృత్తిపై  మక్కువతో వస్తున్న జర్నలిస్టులకు సీనియర్ల నుండి సూచనలు అంతంత మాత్రం ఉండడంతో కొత్తగా వచ్చినవారు నచ్చిన విధముగా వారిదైన శైలిలో  సమస్యను రాస్తూ వినిపిస్తూ ముందుకు కొనసాగుతున్నారు.

 ప్రజల్లో వినిపిస్తున్న మాటలు

 జర్నలిస్టులకు కుటుంబాలు ఉండవా? ఇంట్లో ఎలా గడుస్తుంది , ఏమి రాకుండానే పొద్దు నుండి రాత్రి దాకా తిరుగుతారా? ఆదాయం చాలా ఉంటుందనుకుంటా బయట వారికి తెలియపరచనీయరు అంటూ ప్రజల్లో గుసగుసలు.

 జర్నలిస్టులకు వారు పనిచేసే సంస్థల యాజమాన్యం (డబ్బులు) జీతభత్యాలు ఇవ్వకపోగా వారి సంస్థలలో పనిచేయుటకు యాడ్స్ లాంటివి సంస్థకు పనిచేసే రిపోర్టర్ సే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. జర్నలిజం మీద మక్కువతో  కుటుంబంలోని పెద్దలు ఏమంటున్న పడుతూ , ఇష్టమైన వృత్తిని కొనసాగుతూ, వేరే పనులలో ఇమడలేక  నరకాన్ని అనుభవించే వ్యక్తి జర్నలిస్ట్.

 ప్రభుత్వాలు జర్నలిస్టులను ఆదుకోవాలి

 ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే జర్నలిస్టులు శ్రమను గుర్తిస్తూ వారి కుటుంబాల జీవణం కొరకు జీవన భృతిని కల్పించి జర్నలిస్టుగా కొనసాగించే వారికి అండగా ప్రభుత్వాలు నిలవాలని జర్నలిస్టులు కోరుకుంటూ జర్నలిస్టుల కుటుంబాలను  ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్న జర్నలిస్టులు.

ఇండ్ల మహేష్

9885942502

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >