| Daily భారత్
Logo




పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ధన్పాల్ శ్రీనివాస్ ఎన్నిక

News

Posted on 2025-07-11 21:44:44

Share: Share


పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ధన్పాల్ శ్రీనివాస్ ఎన్నిక

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ధన్ పాల్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ నెల 6న జరిగిన పోలింగ్ ఓట్ల లెక్కింపు శుక్రవారం జరిగింది. ఆయన తన సమీప ప్రత్యర్థి మాజీ జిల్లా, నగర అధ్యక్షుడు అర్వపల్లి పురుషోత్తం గుప్త పై 888 ఓట్లతో గెలుపొందారు. ఈ నెల 6న జరిగిన పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలతో పాటు మాణిక్ భవన్ ( శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల) పాలకమండలి, ఆర్య వైశ్య భవన్ కళ్యాణ మండపం, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటిలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికలు పారదర్శకంగా జరుగలేదని గోడవలు జరిగాయి. ఎన్నికల అధికారులకు పరస్పరం పిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 7న జరగాల్సిన ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం జరిగింది. నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ధన్ పాల్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు... మాణిక్ భవన్ పాఠశాల కమిటీ చైర్మన్ గా ఇంగు శివప్రసాద్ 501 ఓట్ల మెజార్టీతో, ఆర్య వైశ్య భవన్ కు ఇల్లెందుల సుధాకర్ 664 ఓట్లు, వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం కమిటీ చైర్మన్ గా పాల్తీ రవి 1365 ఓట్లతో ప్రత్యర్థిపై గెలుపొంది ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు నియామక పత్రాలను అందజేశారు.ఈ నేపథ్యంలో సంబరాలు నిర్వహించారు.

Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >