Posted on 2025-07-12 17:17:20
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కార్.. ప్రస్తుతం ఆర్డినెన్స్ పేరుతో మరో మోసానికి తెరలేపిందని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల ముందు 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చకుండా కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. ఇప్పుడు ఆర్డినెన్స్ అంటున్న ప్రభుత్వం.. కులగణన పేరుతో ఆరు నెలల పాటు కాలయాపన ఎందుకు చేసిందో చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర సర్కార్.. బీసీ కమిషన్ పేరు చెప్పి కొంతకాలం, డెడికేటెడ్ కమిషన్ పేరుతో మరికొంతకాలం, ఢిల్లీకి బిల్లు పంపి ఇంకొంత కాలం సమయం గడిపిందని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై చిత్తశుద్ధి లేకే ఇలా చేస్తూ వస్తున్నదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల అమలు కాలయాపనకే రేవంత్ సర్కారు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. చట్టబద్ధత లేని ఆర్డినెన్స్లు న్యాయస్థానాల ముందు నిలబడబోవని స్పష్టంచేశారు. ప్రభుత్వ అసంబద్ధ, గందరగోళ నిర్ణయాలతో తెలంగాణ బీసీ వర్గాలు నష్టపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉండి ఉంటే ఢిల్లీకి వెళ్లినపుడు కనీసం ఒక్కసారైనా బీసీ బిల్లు గురించి ప్రధానితో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. తన సీటును కాపాడుకునే ప్రయత్నం తప్ప, రేవంత్ రెడ్డికి బీసీల సమస్యలు పరిష్కరించడంపై లేదని తెలిపారు. రేవంత్ రెడ్డి తన నిజాయితీని నిరూపించుకునేందుకు తక్షణమే 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >