| Daily భారత్
Logo




గూడ్స్ రైలులో భారీ అగ్ని ప్రమాదం

News

Posted on 2025-07-13 12:53:20

Share: Share


గూడ్స్ రైలులో భారీ అగ్ని ప్రమాదం

డైలీ భారత్, తమిళనాడు: తమిళనాడులోని తిరువల్లూరు సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డీజిల్‌ లోడ్‌తో వెళ్తున్న గూడ్స్‌ రైలుకి మంటలు అంటుకున్నాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై పోర్టు నుంచి బెంగళూరుకు ఇండియన్‌ ఆయిల్‌ తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 52 వ్యాగన్లతో వెళ్తున్న గూడ్స్‌ రైలుకు ఆదివారం తెల్లవారుజామున మంటలు అంటుకున్నాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తొలుత రైలు పట్టాలు తప్పిన తర్వాత మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఐదు వ్యాగన్లకు మంటలు వ్యాపించినట్లు సమాచారం.

మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతుండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వారిని అక్కడి నుంచి తరలించడంతో పాటు, సమీప ఇళ్లలోని సిలిండర్‌లను తొలగిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్‌ కూడా నిలిపివేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో చెన్నై- అరక్కోణం మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించామని రైల్వే పోలీసులు వెల్లడించారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >