Posted on 2025-07-13 12:55:05
నగరంలో పలు ప్రాంతాల్లో కొలువు దీరుతున్న గ్రామదేవతలు
అంబరన్ని అంటుతున్న ఊర పండగ వేడుకలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: భాగ్యనగరంలో లస్కర్, ఉజ్జయిని బోనాల ఉత్సవాల తర్వాత రెండో స్థానంలో ఇందూరు జిల్లా లో ఉర పండగ సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. దీంతో ఇందూర్ లోని పలు వీధుల్లో పులోరియా అంటూ భక్తుల నినాదాలతో హోరెత్తింది.. ఇందూర్ నగరంలో దశాబ్దాల చరిత్ర కలిగిన ఊర పండగ ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నగరంలోని ఖిల్లా ప్రాంతంలో తేలు మైసమ్మ గద్దె నుంచి దేవతామూర్తుల ప్రతిష్టాపనకు ఉత్సవమూర్తులు ఊరేగింపుగా కదిలాయి. జిల్లా అధికార యంత్రంగం పర్యవేక్షణలో పోలీసుల భారీ బందోబస్తు మధ్య పూర పండుగ సంబరాలు షురూ అయ్యాయి. తేలు మైసమ్మ గద్దె నుంచి పెద్దమ్మ, పోచమ్మ, పగడాలమ్మ, సార్గమ్మ,కొండల రాయుడు, భోగంసాని, మహాలక్ష్మమ్మ, రాట్నం (ఆసు), పెద్దపులి ప్రతిమలను వేడుకగా ఊరేగించారు ఊరేగింపు పెద్ద బజార్, కోట గల్లి,జండగల్లి, వినాయక్ నగర్, మహాలక్ష్మి నగర్ ప్రాంతాలలో అమ్మవార్లను ప్రతిష్టించేందుకు ఊరేగింపు కొనసాగుతోంది జొన్నలు, పసుపు, కుంకుమలతో చేసిన సరి క్లస్టర్ ఊరేగిస్తూ ఊరేగింపు సందర్భంగా పంపిణీ చేశారు. భక్తులు దారి పొడవునా మేకలు కోళ్లను బలిస్తూ తమ మొక్కులను చెల్లించుకున్నారు. నగరంలోని వీధుల వెంట పూల పండుగ దృశ్యాలు సంబరంగా కనిపించడం విశేషం. నగరంలో అమ్మవార్ల ఊరేగింపు సందర్భంగా భక్తులు అమ్మవారు ఆవహించిన పూనకాలతో ఊగిపోయారు. పులోరియా అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపు ముందుకు సాగింది. ఈ అమ్మవార్ల ఊరేగింపు ప్రతిష్టాపన సాయంత్రం వరకు కొనసాగుతుంది.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >